ఎన్నికలకు ముందు టిడిపి అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ పిక్స్ పథకాలపై క్లారిటీ వచ్చేసిం ది.ఈ పథకాల్లో ముఖ్యమైన వాటిని అమలు చేయాలని తాజాగా నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నిర్ణయించారు. ఆర్థికంగా భారం పడని కొన్ని పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని కలెక్టర్లకు ఆయన తేల్చి చెప్పారు. కలెక్టర్ల సమావేశంలో చూచాయ‌గా చెప్పిన మాటలను బట్టి ఈ నెల నుంచే కనీసం మూడు పథకాలను అమలు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.వీటిలో ప్రధానంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్ల‌ను ప్రారంభించనున్నారు. వీటితో పాటుగా ఎన్నికలకు ముందు ఇచ్చిన మరో రెండు కీలకమైన హామీలు నిరుద్యోగ భృతి. నెలకు 1500 రూపాయలు చొప్పున మహిళలకు ఇస్తామన్న ఆడబిడ్డ నిధి. ఈ పథకాలపై కూడా చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఈ రెండు పథకాలను సాధ్యమైనంత వేగంగా అమలు చేసే దిశగా అడుగులు వేయాలని భావిస్తున్నట్టు ఆఫ్ ది రికార్డ్ చెప్పుకొచ్చారు.ఇప్పటికే మెగా డీఎస్సీ, పెన్షన్లు పెంపు వంటి హామీలపై సీఎం చంద్రబాబు సంతకాలు చేయడం జరిగింది.ఇప్పటికే బీమా పథకం సొమ్మును రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.ఇంట్లో వ్యక్తి చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు తీసుకొచ్చిన బీమా పథకం సొమ్మును రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు మంత్రి సుభాష్ ప్రకటించారు.

దీని తర్వాత ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని అందించబోతున్నామని ప్రకటించినప్పటికి , దానిపై విధివిధానాలు పూర్తి కాకపోవడంతో ఈ హామీ అమలు వాయిదా వేయడం జరిగింది. ఆడబిడ్డ నిధి పథకం అమలుకు ఎన్డీఏ సర్కార్ శ్రీకారం చూట్టబోతోంది. మహిళలకు నెలకు రూ.1500 ఇచ్చే పథాకాన్ని త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీనికి కావాల్సిన అర్హతలు త్వరలోనే విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ. 1500 ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చింది.ఆ హామీని నెరవేర్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నద్దం అవుతోంది. సెప్టెంబర్ నెలలో ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా తల్లికి వందనం పథకం అమలుపై కూడా మంత్రి నిమ్మల రామానాయుడు శుభవార్త చెప్పారు. తల్లికి వందనం పథకంలో భాగంగా రాష్ట్రంలో స్కూల్ కు వెళ్తున్న ప్రతి విద్యార్థినికి రూ.15 వేలు త్వరలోనే వారి అకౌంట్లలో జమ చేస్తామని వెల్లడించారు. వీటికి సంబంధించిన అధికారులతో మాట్లాడిన నిమ్మల.. అతి త్వరలో మరిన్ని వివరాలు ప్రకటిస్తామని అన్నారు. ఎన్నికల్లో ప్రకటించిన అన్ని హామీలను ఒక్కొకటిగా నెరవేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: