మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం ఎన్ని నేరాలకు పాల్పడ్డాడో లెక్కేలేదు అప్పుడప్పుడు ఇతను చేసినా కొన్ని క్రైమ్స్ వెలుగులోకి వస్తుంటాయి వాటి గురించి తెలుస్తుంటే మనం షాక్ అవ్వకు తప్పదు. ఆయనతోపాటు ఆయన అనుచరులు మన భారతీయులను కూడా వదల్లేదు. ఆయనకు తెలిసిన ఒక వ్యక్తి కుమార్తె పెళ్లి గౌను విషయంలో మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమారుడిని కిడ్నాప్‌ చేశాడు. ఈ షాకింగ్ క్రైమ్ గురించి మాజీ ఐపీఎస్‌ అధికారి డాక్టర్‌ శైలేంద్ర శ్రీవాస్తవ తన 'షాకిల్‌ది స్టార్మ్‌' బుక్‌లో బట్ట బయలు చేశారు. అంతేకాదు మధ్యప్రదేశ్‌ దావూద్‌ ఇబ్రహీం నేర సామ్రాజ్యంలో చాలా ఇంపార్టెంట్ పాట అయిందని కూడా తెలిపారు. అక్కడ మాఫియా కదలికలు ఎలా సాగేవో కూడా తెలియజేశారు.

పెళ్లి గౌను విషయానికి వస్తే దావూద్‌ ఇబ్రహీం కూతురు పేరు మహరూఖ్‌. ఆమె అంటే దావూద్ కి చాలా ఇష్టం. ఈమె పెళ్లిని 2005, జులైలో మక్కాలో చాలా గ్రాండ్ గా చేశాడు. ఆ వేడుకకు ఆమె ధరించిన గౌనును ఇస్మాయిల్‌ ఖాన్‌ అనే దర్జీ డిజైన్ చేశాడు. అతడి స్వస్థలం  మధ్యప్రదేశ్‌లోని శివ్‌పుర్‌. మహరూఖ్‌ పెళ్లయిన 30 రోజుల తర్వాత ఆగస్టు 14న ఇండోర్‌లోని ఓ సిమెంట్‌ ఫ్యాక్టరీ యజమాని కుమారుడు నితీశ్‌ నాగోరి (20)ని  ఇస్మాయిల్‌ కిడ్నాప్‌ చేశాడు. రూ.4 కోట్లు ఇస్తే గాని అతడిని వదిలిపెట్టమని కూడా డిమాండ్ చేశాడు.

పోలీసులు వేగంగా స్పందించి నిందితులను అదుపులోకి తీసుకుని బాలుడిని రక్షించారు. శివపూర్ కు చెందిన ఇస్మాయిల్ ఖాన్ అనే టైలర్ ప్రమేయం ఉన్నట్లు విచారణలో తేలింది. ఇస్మాయిల్ దావూద్ సహచరుడు అఫ్తాబ్ ఆలమ్‌తో సన్నిహితంగా ఉండేవాడు. ఇస్మాయిల్‌కు దుబాయ్‌లో ఉద్యోగం వస్తుందని, దావూద్ కుమార్తె గౌను కుట్టించేందుకు కోట్లలో డబ్బు వస్తుందని ఆశతో దావూద్‌కు విమోచన సొమ్ములో వాటా ఇవ్వాలని పథకం పన్నారు. అయితే ప్లాన్ విఫలం కావడంతో ఇస్మాయిల్, అఫ్తాబ్ దుబాయ్ పారిపోయారు.

 కిడ్నాప్ కేసులో నితీష్ ఇద్దరు స్నేహితులు ధృవ్, గౌరవ్ దావూద్ గ్యాంగ్ కు సహకరించారు. ఇద్దరినీ అరెస్టు చేశారు, దావూద్‌తో తనకున్న సంబంధాలను బట్టబయలు చేస్తూ ఇస్మాయిల్‌ సూత్రధారి అని ధ్రువ్‌ వెల్లడించాడు. మునుపటి కిడ్నాప్ నుండి వచ్చిన ఫోన్ నంబర్ మరొక షూటర్ విక్కీ మల్హోత్రా అరెస్టుకు ఎలా దారి తీసిందో కూడా పుస్తకం వివరిస్తుంది.  మధ్యప్రదేశ్‌లో దావూద్ ఇబ్రహీం కార్యకలాపాలు మరియు కరాచీ, దుబాయ్‌లలో దావూద్‌ను చంపడానికి విక్కీ చేసిన ప్రయత్నాలను ఇది కవర్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: