దేశ వ్యాప్తంగా , రాష్ట్ర వ్యాప్తంగా అనేక కొత్త కొత్త పథకాలు అమలు అవుతూ ఉంటాయి. అలా అమలు అయ్యే పథకాలలో కొన్నింటికి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నో కోట్ల డబ్బు ఖర్చు పెట్టినా కానీ కొన్ని పథకాలు ప్రజల మనసును దోచుకోవు. ఇక కొన్ని పథకాలు మాత్రం ప్రజలను ఎంతో ఆకట్టుకుంటాయి.

ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు అనేక పథకాలు అమలు అయ్యాయి. అందులో కొన్ని పథకాలకు ప్రజల నుండే వ్యతిరేకత వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇక కొన్ని పథకాలు మాత్రం అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అయినవి కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో రైతు బీమా ఒకటి. తెలంగాణ రాష్ట్ర రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ఎం ఏ కారణంతోనైనా రైతు చనిపోతే ,  నామినీకి ఎల్ ఐ సీ నుంచి 10 రోజుల్లోగా 5 లక్షల బీమా పరిహారం అందించడానికి ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో రైతు కోసం 2,271 రూపాయలను ప్రీమియంగా చెల్లించి , 5 లక్షల రూపాయలను బీమాగా అందిస్తోంది. రైతులకు 5 లక్షల బీమా కవరేజ్ అందించిన దేశంలోని తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. కొంత కాలం తరువాత రైతు బీమా పథకం ప్రీమియం 56.54 శాతానికి పెరుగగా , ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ. 3,556 చొప్పున మొత్తం 32.16 లక్షల మంది రైతులకు రూ.1143.60 కోట్లను ప్రీమియంగా కూడా ఎల్.ఐ.సి.కి చెల్లించింది.

ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అమలు పరిచిన ఈ పథకం అద్భుతమైన స్థాయిలో విజయవంతం అయ్యింది. రైతు జీవితం అంటానే కష్టాలతో కూడుకుపోయి ఉంటుంది. అలా కష్టాలతో కూడుకుపోయిన వ్యక్తి అనుకోకుండా మరణించినట్లు అయితే ఆ కుటుంబం ఒక్క సారిగా అప్పుల ఉబిలోకి కురుకుపోయే అవకాశం ఉంటుంది.

అలాంటి కుటుంబాలకు రైతు బీమా పథకం అనేది గొప్ప పథకం. అందువల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులందరితో పాటు మామూలు ప్రజలు కూడా ఈ పథకం చాలా అద్భుతమైనది , రైతులకు ఎంతో న్యాయం చేకూర్చే పథకం అని దీనిపై ప్రశంసలు కురిపించిన సందర్భాలు ఉన్నాయి. ఈ పథకం ద్వారా కేసిఆర్ కు అద్భుతమైన గుర్తింపు లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: