ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి మూడున్నర నెలలు అవుతోంది. రాష్ట్రంలో అటు అభివృద్ధికి ఇటు సంక్షేమానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. జగన్ ఆ బ్యాలెన్స్ చేయకపోవడం వల్లే 2024 ఎన్నికల్లో దారుణమైన ఫలితాలను సొంతం చేసుకున్నారు. అయితే చంద్రబాబు మాత్రం జగన్ చేసిన తప్పులు చేయకుండా తెలివిగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందడుగులు వేస్తున్నారు. అనుభవంతో ప్రజలను మెప్పిస్తూ బాబు ప్రశంసలు అందుకుంటున్నారు.
 
చంద్రబాబు పాలనలో లోపాలు లేవా అంటే ఉన్నాయనే చెప్పవచ్చు. అయితే జగన్ పాలన కంటే తన పాలన మెరుగ్గా ఉందనే అభిప్రాయాన్ని కలిగించడంలో మాత్రం ఆయన సక్సెస్ అయ్యాడని కచ్చితంగా చెప్పవచ్చు. అనుభవంతో చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో కొన్ని విమర్శలు ఉన్నా మెజారిటీ నిర్ణయాల విషయంలో మాత్రం ప్రశంసలు వ్యక్తమవుతూ ఉండటం కొసమెరుపు.
 
అన్న క్యాంటీన్ల ఏర్పాటు ద్వారా చంద్రబాబు ప్రజల ఆకలి తీరుస్తున్నారు. అన్న క్యాంటీన్లకు కొంతమంది విరాళాలు ఇస్తుండటంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం కూదా కొంతమేర తగ్గుతుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. రాష్ట్రంలోని కొన్ని రోడ్లను ప్రైవేట్ పరం చేయడం ద్వారా ఏపీలోని రోడ్ల రూపురేఖలు అయితే మారనున్నాయని చెప్పవచ్చు.
 
జగన్ నిర్మించిన మెడికల్ కాలేజీల విషయంలో సైతం ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా చంద్రబాబు నిర్ణయాలు ఉన్నాయని భోగట్టా. రాష్ట్రంలో లిక్కర్ రేట్లు తగ్గుతుండటంతో మద్యం ప్రియులు సైతం ఎంతో సంతోషిస్తున్నారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని చెప్పవచ్చు. చంద్రబాబు తెలివితేటలు జగన్ కు ఎప్పుడు వస్తాయో అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు అనుభవాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువేనని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. ఐదేళ్లలో అమరావతిని శరవేగంగా అభివృద్ధి చేసేలా చంద్రబాబు ప్రణాళికలు ఉన్నాయని తెలుస్తోంది. అమరావతి వేగంగా అభివృద్ధి చెందితే రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు మరింత వేగంగా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: