గత కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాలలో విమానాశ్రయాలు రాబోతున్నాయనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఏపీలో టీడీపీకి, రామోజీరావుకు మంచి అనుబంధంగా ఉన్న సంగతి తెలిసింది. ఈయన మరణాంతరం సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఒక లైబ్రరీని కూడా నిర్మించి విడుదల చేశారు. అయితే ఇప్పుడు అంతకుమించి ఇంకా ఏదో చేయాలనే తపన ఏపీ సీఎం చంద్రబాబులో కనిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలోని ఆయనకు మరో రెండు ఆలోచనలు వచ్చినట్లు తెలుస్తోంది.


ఈనాడు అధినేత రామోజీరావుకు సీఎం చంద్రబాబుకు మధ్య మంచి స్నేహ సంబంధం ఉన్నది.1983 కాలంలో నందమూరి తారక రామారావు కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ తర్వాత టిడిపి పార్టీ పగ్గాలు చంద్రబాబుకు రావడంలో కూడా రామోజీరావు కీలకమైన పాత్ర పోషించారని అప్పట్లో వార్తలు వినిపించాయి. తదనంతరం చంద్రబాబుకు ఆయనకు మధ్య మంచి సన్నిహిత సంబంధం ఏర్పడింది. అలా 2014 సమయంలో కూడా చంద్రబాబును సీఎం చేయడానికి కీలకమైన పాత్ర ఈనాడు పత్రిక పోషించింది.


2024 లైఫ్ అండ్ డెత్ సమయంలో కూడా ఈనాడు పత్రిక పోషించిన పాత్ర గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇక చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత కొద్ది రోజులకి రామోజీరావు మరణం జరిగింది. దగ్గరుండి మరి అన్ని కార్యక్రమాలు చేయించారు ఏపీ సీఎం. అయినప్పటికీ కూడా రామోజీ రుణం తీర్చుకోవాలని ఇందులో భాగంగా గన్నవరం విమానాశ్రయానికి రామోజీరావు పేరు పెట్టాలనే ఆలోచనలో ఏపీ సీఎంతో పాటు పలువురు టిడిపి నేతలు కూడా ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రామోజీ రావు విమానాశ్రయం గన్నవరం అని .. అలాగే రామోజీరావు గుడివాడ నియోజకవర్గం అనే విధంగా పేర్లు మార్చేలా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీటి పైన కూడా ఎలాంటి అభ్యంతరాలు వస్తాయో లేదో చూడాలి మరి. ఏపీ ప్రభుత్వం ఇలాంటి విషయాల పైన క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: