ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చాలా కష్టాల్లో ఉన్నాడు. పార్టీ అధికారం కోల్పోవడం.. ఇటు తన కుటుంబం కూడా దూరం అవ్వడం.. జగన్మోహన్ రెడ్డికి సమస్యగా మారాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ దారుణంగా ఓడిపోయింది. దీంతో ఆ పార్టీలో ఉండేందుకు చాలామంది నేతలు ఇష్టపడటం లేదు.

 మొన్నటి ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే వైసీపీ పార్టీ పరిమితం కావడం జరిగింది. అటు పార్లమెంటు  ఎంపీ స్థానాలను కూడా కేవలం నాలుగు  వరకే సంపాదించుకుంది. అయితే జగన్మోహన్ రెడ్డి... ఏపీలో దారుణంగా ఓడిపోవడానికి ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల కారణమని కొంతమంది చెబుతున్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో ఈ పరిస్థితి నెలకొంది అని అంటున్నారు.

 కాంగ్రెస్ పార్టీ తరఫున వైయస్ షర్మిల.. ప్రచారం చేయడంతో చాలా చోట్ల వైసిపి పార్టీ ఓడిపోయిందని చెబుతున్నారు. ముఖ్యంగా వైఎస్ వివేకానంద హత్య కేసును... వైయస్ షర్మిల బాగా హైలెట్ చేయగలిగారు.  వివేకా హత్య వెనుక జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ ఉన్నట్లుగా కూడా ప్రచా రం చేయడంలో షర్మిల సక్సెస్ అయ్యారు. దీంతో జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. అయితే ఓటమి తర్వాత షర్మిల వ్యాల్యూ జగన్మోహన్ రెడ్డి తెలుసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 అటు తన అన్న జగన్ మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కూడా... వైయస్ షర్మిల జీర్ణించుకోవడంలేదట. అందుకే వీరిద్దరూ త్వరలోనే మళ్లీ కలవబోతున్నారని వార్తలు వస్తున్నాయి. దీనికోసం ఓ అజ్ఞాత వ్యక్తి రంగంలోకి దిగినట్లు కూడా చెబుతున్నారు. ఆయన ప్రముఖ రాజకీయ విశ్లేషకులుఅయినట్లు తెలుస్తోంది. షర్మిల అలాగే జగన్మోహన్ రెడ్డి కలిసేలా ఆయన... విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. మరి ఆ అజ్ఞాత వ్యక్తి చేస్తున్న ప్రయత్నం ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: