తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత... పరిస్థితులు అత్యంత దారుణంగా తయారవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం లో... కరెంటు కోతలు, నీటి సమస్యలు , రైతన్నల ఆవేదనలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు రోజుకోటి జరుగుతున్నాయి. నిత్యం దీనికి సంబంధించిన వార్తలను మనం సోషల్ మీడియాలో అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చూస్తున్నాం. అయితే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం... మరో వివాదంగా మారింది.

తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముందు... రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టేందుకు... రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో.. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం కంటే తెలంగాణ విగ్రహం పెట్టాలని గులాబీ పార్టీ నుంచి.. కొత్త వాదన వస్తోంది.

వాస్తవానికి గత గులాబీ ప్రభుత్వం.... తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని స్థలాన్ని సచివాలయం ముందు కేటాయించింది. కానీ అంత లోపే ప్రభు త్వం మారడం కూడా జరిగిపోయింది. దీంతో కేసీఆర్ సర్కార్ ఈ విగ్రహాన్ని పెట్టలేకపోయింది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత... రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు కోసం రంగం సిద్ధం చేసింది.

 ఇదొక్కటే కాకుండా రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత అన్ని పథకాల పేర్లు మార్పించారు. నెంబర్ ప్లేట్లపై కూడా టీఎస్ ను టీజీ గా మార్చారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి కూడా అచ్చం ఇలాగా... అనేక మార్పులు చేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాటి పేర్లు మార్చారు. అయితే రేవంత్ రెడ్డి కూడా ఇలా చేస్తున్న నేపథ్యంలో... జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో ఎదురైన పరాభవమే రేవంత్ రెడ్డికి కూడా ఎదురవుతుందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి దీనిపై ఎలా ముందుకు వెళతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: