- కిలో రు. 2 బియ్యం ప‌థ‌కం దేశానికే ఆద‌ర్శం
- అన్నగారి అన్నం, సాంబార్‌.. జ‌న‌తా వ‌స్త్రాలు సూప‌ర్‌

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

తెలుగు సినిమా రంగంలో తిరుగులేని రారాజుగా ఒక వెలుగు వెలిగిన ఎన్టీఆర్.. రాజకీయాలోకి వచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించి.. కేవలం 9 నెలలలోనే అధికారంలోకి వచ్చి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యి చరిత్రలోనే చెరిగిపోని రికార్డు సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు.. పరిపాలనలో తీసుకున్న నిర్ణయాలు.. అప్పటికీ, ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోయాయి. సంక్షేమ పథకాలకు ఆధ్యుడు ఎన్టీఆర్. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.


ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలలో ముఖ్యమైనది రెండు రూపాయలకే కిలో బియ్యం. ఈ పథకం ద్వారా ఎంతోమంది నిరుపేదలకు కడుపు నిండింది. అప్పట్లో బియ్యం రేటు చాలా ఎక్కువగా ఉండేది. ఎప్పుడు అయితే ఎన్టీఆర్ కిలో రెండు రూపాయల బియ్యం పథకం ప్రవేశపెట్టారో.. మధ్యతరగతి, దిగువ పేద తరగతి వర్గాలకు ఆయన ఒక దేవుడు అయిపోయాడు. వారు రెండు పూట్లా కడుపునిండా అన్నం తిన్నారు. అంటే అది ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకం ఘనత అని చెప్పాలి. అలాగే ఎంతో మంది పేద రైతులను కష్టాలకు గురిచేస్తున్న పటేల్ - పట్వారి వ్యవస్థను కూడా ఎన్టీఆర్ ర‌ద్దు చేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు.


ఈ విషయంలో ఎన్టీఆర్ పై ఎన్నో విమర్శలు వచ్చినా.. ఆయన ఎక్కడ వెనక్కి తగ్గలేదు. అలాగే ఎన్టీఆర్ అమలు చేసిన మరో ముఖ్యమైన పథకం మద్యపానం నిషేధం. అలాగే మెడికల్ ఇంజనీరింగ్ విద్యను కామన్ ఎంట్రన్స్ పరీక్ష ద్వారా సామాన్యులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కూడా ఆయన చలవే. జనతా వస్త్రాల పథకంతో ప్రతి పేదవాడికి కనీస అవసరమైన వస్త్రాలను అందించారు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో అన్నా ప్రజా క్యాంటీన్.. అన్నగారి అన్నం, సాంబార్‌. అలాగే పురోహితులుగా ఎవరైనా ఉండవచ్చు అన్న నిబంధన తీసుకువచ్చింది కూడా ఎన్టీఆర్ కావటం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: