- పంచాయ‌తీ స‌మితిలు ర‌ద్దుతో మండ‌ల వ్య‌వ‌స్థ‌కు శ్రీకారం
- ఎంపీటీసీలు, జ‌డ్పీటీసీలో లోక‌ల్ పాల‌న‌
- మండ‌లాల‌తో ప‌రుగులు పెట్టిన అభివృద్ధి

( విజ‌య‌వాడ - ఇండియా హెరాల్డ్ )

1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో దశాబ్దాల నుంచి పాతుకుపోయిన కాంగ్రెస్ పార్టీని కుక్కుటి వేళ్ళతో సహా పెకిలించి అధికారంలోకి వచ్చారు. నందమూరి తారకరామారావు.. పార్టీ పెట్టిన తొమ్మిది నెలలలో అధికారంలోకి రావడం ఓ సంచలనం. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ రెండేళ్లు పాలన పూర్తి చేసుకోకుండానే.. నాదెండ్ల భాస్కరరావు పొందిన కుట్రలో ఆయన అనూహ్యంగా పదవీచ్యుతుడు అయిపోయారు. అనంతరం 1985 ఎన్నికలలో ఆయన భారీ మెజార్టీ సాధించి మరోసారి అధికారంలోకి వచ్చారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తీసుకువచ్చిన ఎన్నో సంస్కరణలు, పథకాలు, తెలుగుజాతి ఉన్నంతకాలం తెలుగు ప్రజల హృదయాల్లో చెక్కుచెదరని విధంగా నిలిచిపోయాయి.


అలాంటి వాటిలో బ్రిటిష్ వారు తెచ్చిన తాలూకా వ్యవస్థను రద్దుచేసి.. మండల వ్యవస్థను ఎన్టీఆర్ ప్రవేశపెట్టారు. అంతకుముందు తాలూకా స్థాయిలో పంచాయితీ సమితులు ఉండేవి. ఇప్పుడు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి అంతా విస్తరించి ఉండేలా.. ఈ పంచాయతీ సమితిలు ఉండేవి. నియోజకవర్గం మొత్తం మీద.. నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ అధికారుల కార్యాలయాలు ఉండేవి. ఎవరికీ ఏ పని కావాల్సినా... నియోజకవర్గ కేంద్రానికి వెళ్లి రావాల్సిందే. దీనివల్ల ప్రజలు ఎన్నో కష్టనష్టాలకు గురవడంతో పాటు.. ఆయా ప్రయాసలకు గురయ్యేవారు. కాలం వృధా అయ్యేది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పంచాయతీ సమితులను తాలూకాలను రద్దుచేసి.. మండల వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు.


ఒక నియోజకవర్గాన్ని నాలుగు నుంచి ఐదు మండలాలుగా విభజించారు. చుట్టుపక్కల ఉన్న 15 గ్రామాలను ఒక మండలం గా మార్చి మండల వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చి.. ఎంపీటీసీ, జడ్పిటిసిలు ఏర్పాటు చేసి మండల పాలనను అందుబాటులోకి తెచ్చారు. దీంతో అప్పటివరకు ఎన్నో ఇబ్బందులకు గురైన ప్రజలకు.. మండల వ్యవస్థ ఓ ఆశా కిరణంగా నిలిచింది. అదే మండల వ్యవస్థ ఇప్పటికీ ఎన్నో రాష్ట్రాలలో అలాగే కొనసాగుతూ వస్తోంది. ఎన్టీఆర్ మండల వ్యవస్థ ప్రవేశపెట్టడం ద్వారా.. అధికార వికేంద్రీకరణకు నాంది పలికినట్టు అయింది. దీనివల్ల ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండి.. పాలన వికేంద్రీకృతం కావడంతో పాటు.. అభివృద్ధి పరుగులు పెట్టటానికి కారణంగా నిలిచిందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: