- నీలం సంజీవ రెడ్డి సీఎంగా ఉండ‌గా ఏపీలో పంచాయ‌తీ పాల‌న కు శ్రీకారం
- 1986 లో మండ‌ల వ్య‌వ‌స్థ‌ను తీసుకొచ్చిన ఎన్టీఆర్‌
- 1986 లో స‌ర్పంచ్ ను డైరెక్టుగా ఎన్నుకోవ‌డం ప్రారంభం
- కిర‌ణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న‌ప్పుడు మ‌హిళ‌ల‌కు 50 % రిజ‌ర్వేష‌న్లు

- ( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ ) .

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ ఎలా ఏర్పాటు ? అయింది దీనిని ఎవరు ప్రవేశపెట్టారు అన్నది చూస్తే చాలా ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1959 అక్టోబర్ 11న నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మహబూబ్ న‌గర్ జిల్లా షాద్ న‌గర్ లో మొదటి పంచాయతీ సమితి ప్రారంభించారు. అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన రాష్ట్రాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండోది. ఆ తర్వాత అశోక్ మెహ‌తా సిఫార్సులను అనుసరించి 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పంచాయతీ వ్యవస్థ రద్దుచేసి మండల పరిషత్ విధానాన్ని ప్రవేశపెట్టారు.


మండల పరిషత్ వ్యవస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1987 నుంచి అమల్లోకి వచ్చింది. ఇక 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ఆధారంగా 1994లో నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం 1994 మే 30 నుంచి అమల్లోకి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా 1986లో సర్పంచ్ ల‌ను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు. 1995 మే 30 తర్వాత ఇద్దరు పిల్లలకు మించి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడానికి లేదా పదవిలో కొనసాగడానికి అనర్హులుగా నిర్ణయించారు.


అలాగే మహిళలకు స్థానిక సంస్థలలో 1 / 3 వంతు రిజర్వేషన్లు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థానిక సంస్థలలో మహిళలకు కూడా 50% రిజర్వేషన్లు కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అలా ఏపీ లో లోక‌ల్ పాల‌న ద‌శ దిశ‌లుగా అభివృద్ధి చెందుతూ వ‌చ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap