వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కొడాలి నాని.. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలలో ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయారు. తెలుగుదేశం పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు.. ఆయన తనయుడు నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఇష్టం వచ్చినట్టు తిట్టేశారు. కొడాలి నాని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేశారు. తీవ్రమైన పదజాలంతో దుర్భాషలాడారు. మరి అలాంటి నాయకుడిని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు ? వదిలేస్తుంది.. ఖచ్చితంగా కేసులు పెట్టి జైలుకు పంపిస్తుందని అందరూ అనుకుంటునారు.


పైగా కొడాలి నాని పై కేసులు పెట్టాలంటే చాలా సెక్షన్లు వాడుకోవచ్చు, ఇందుకు ప్రత్యేకంగా ఎలాంటి కారణాలు వెతకాల్సిన అవసరం లేదు, గుడివాడలో వరుసగా జరిగిన కేసినో వ్యవహారం చాలు.. చేతికి మట్టి అంటకుండా కొడాలి నానిని జైలుకు పంపించవచ్చు. కానీ.. కూటమి పార్టీ వచ్చి రెండు నెలలు అయింది. ఇప్పటివరకు కొడాలి నాని పై ఎలాంటి  ? చర్యలు తీసుకోలేదు. పైగా వల్లభనేని వంశీ పై ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి.. వంశీని ఎప్పుడు ? అరెస్టు చేయాలా అని ఆలోచన చేస్తున్నారు. మరి నాని విషయంలో ఎందుకు చర్యలు ? తీసుకోవడం లేదు అంటే.. దీని వెనక ఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి. కొడాలి నాని పై కేసు పెట్టి జైలుకు పంపిస్తారని తెలుగు తమ్ముళ్లు కూడా కోరుకుంటున్నారు.


ఈ విషయంలో ఒక్క అడుగు కూడా ముందు పడలేదు. దీనికి కారణం జూనియర్ ఎన్టీఆర్ అనే చర్చ టిడిపిలో నడుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తో కొడాలి నాని కి ఉన్న సంబంధం అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఎన్టీఆర్.. కొడాలిని కాపాడుతున్నారనేది తమ్ముళ్లు చెబుతున్న మాట. ఎన్టీఆర్ డైరెక్ట్‌గా కాకపోయినా.. లోకేష్‌కు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉన్న కొందరు నాయకులు ద్వారా.. జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంలో జోక్యం చేసుకొని తెరవెనక మంత్రంగం నడుపుతూ.. కొడాలి నానిని కాపాడేలా చక్రం తిప్పుతున్నట్టు తెలుగుదేశం వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి ఈ విషయం పూర్తిగా బయటికి వస్తే పార్టీలో తీవ్ర ఆగ్రహావేశాలు కచ్చితంగా వస్తాయనటంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: