తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ చేసిన నేపథ్యంలో.. హరీష్ రావును కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేస్తున్నారు. ఆగస్టు 15వ తేదీ లోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని... హరీష్ రావు సవాల్ చేశారు. అలా రుణమాఫీ పూర్తిస్థాయిలో చేస్తేనే... తాను రాజీనామా చేస్తానని హరీష్ రావు స్పష్టం చేయడం జరిగింది.

అయితే... 2 లక్షల రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ముందుగా చెప్పినట్లుగానే ఆగస్టు 15వ తేదీ లోపు తెలంగాణ రైతులకు... 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. అయితే ఈ రెండు లక్షల రుణమాఫీలో అనేక కోతలు విధించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.  తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ రుణమాఫీ చేయాలంటే 41 లక్షలు కావలసి ఉండేది.

 కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం అనేక కోతలు పెట్టి... దాదాపు 18 లక్షల మందికి రుణమాఫీ చేసింది. అంటే 24 లక్షల వరకు మాత్రమే... రైతులకు రుణమాఫీ చేయగలిగింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దాదాపు 60 శాతం మంది రైతులకు రుణమాఫీ ఇంకా కాలేదని లెక్కలు చెబుతున్నాయి. కానీ మేము రుణమాఫీ చేశామని హరీష్ రావు వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు... పట్టుబడుతున్నారు.

 దానికి తగ్గట్టుగానే గులాబీ పార్టీ నుంచి కౌంటర్ కూడా వస్తోంది. పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకుండా రాజీనామా ఎలా చేస్తారని మండిపడుతోంది గులాబీ పార్టీ.  అయితే ఇందులో భాగంగానే సిద్దిపేటలో గులాబీ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య వివాదాలు కూడా చోటుచేసుకున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే సిద్దిపేటకు వచ్చిన మైనంపల్లి హనుమంతరావు... హరీష్ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సిద్దిపేటలో ఉప ఎన్నిక వస్తే.. హరీష్ రావును ఓడించి..  తన సత్తా చాటుతానని మైనంపల్లి సవాల్ విసిరారు. మరి ఈ సవాల్ పై హరీష్ రావు ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: