* పేదల పాలిట వరంగా మారిన ఫీజు రీయింబర్స్ మెంట్.!
* అధికారాలు మారిన అమలు చేయడం తప్పట్లే..!
* ఫీజు రీయింబర్స్ మెంట్-జగనన్న విద్యదీవెన-పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్(RTF) గా మారుపేర్లు..!

(ఆంధ్రప్రదేశ్-ఇండియాహెరాల్డ్): ఏపీలో ప్రస్తుతం రాజకీయాలు ఎలా ఉన్నాయి అంటే ఎన్నికలకు ముందు ప్రధాన పార్టీలు ప్రజల ముందు పెట్టె తమ తమ మేనిఫెస్టోలో తాము ఏం చెప్తే అది చేయాల్సిందే అనేలాగా మారిపోయారు ప్రజలు. ఒకవేళ వాళ్ళు మానిఫెస్టోలో చెప్పినట్లుగా చేయకపోతే మాత్రం తర్వాత ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి చవిచూపడం ఖాయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో రాజకీయాల పరంగా ఎన్టీఆర్ తర్వాత అంత పెద్ద క్రేజ్ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే మొదట గుర్తుకొచ్చే పెద్దాయన వైయస్సార్.అప్పటి అధికార టీడీపీపై తీవ్ర నిరాశతో ఉన్న ప్రజలను ఆకట్టుకునేవిధంగా 2003లో వైయస్సార్ చేపట్టిన పాదయాత్ర అఖండ విజయాన్ని సాధించిపెట్టి 2004లో సీఎం పదవి దక్కేలా చేసింది.అధికారం చేపట్టినాక చివరిదశలో వైయస్సార్ కు వచ్చిన సరికొత్త ఆలోచన పేద విద్యార్థుల చదువు కోసం వచ్చిందే ఫీ-రీ-ఏమ్బెర్స్్మెంట్. పేదవాడి పిల్లలు చదువుకు దూరం కాకుండా వారందరికీ చదువుకునేలా చేసిన పధకమే ఫీ-రియంబర్స్మెంట్. 2008-09 విద్య సంవత్సరములో ఈ పధకానికి శ్రీకారం చుట్టారు. దాంతో అనేక మంది లబ్ది పోంది ఈరోజు ఇంజనీర్లుగా,డాక్టర్లుగా, సాఫ్ట్వేర్ రంగంలో రానిస్తున్నారు అంటే డానికి కారణం ఆ మహానేత తెచ్చిన ఫీ రియంబర్స్మెంట్ పధకమే.

అయితే దురదృష్టవాసత్తు వైయస్సార్ 2009 లో అధికారం చేపట్టకా మరల ఈ పధకం అయిదు సంవత్సరాలు కంటిన్యూ చేద్దాం అనుకునేలోపు ఆయన ప్రమాదంలో మరణించారు అయినప్పటికీ ఆయన ఇచ్చిన హామీలో భాగంగా ఈ పధకాన్ని అప్పటి ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కంటిన్యూ చేయలేకతప్పలేదు. ఇప్పటికీ ఫీ రియంబర్స్మెంట్ అంటే గుర్తొచ్చే నాయకుడు ఆ మహానేత వైయస్సార్ మాత్రమే.ఆ తర్వాత 2014 అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వం కూడా ఈ పధకాన్ని తీయలేకపోయింది. అప్పటికే వైయస్సార్ నాటిన ఈ పధక బీజాలు ప్రజల్లో వెళ్లిపోయాయి కనుక ఏపీలో అధికారం మారినప్పటికీ ఏ నాయకుడు కూడా ఈ పధకాన్ని తీసేయలేకపోయారు.అయితే అధికారం చేపట్టిన టీడీపీ అదే పేరుతొ కొనసాగించింది. అయితే 2019 ఎన్నికల్లో జగన్ అధికారం చేపట్టాక ఈ పధకానికి పేరు మార్చి జగనన్న 'విద్యదీవెన' అంటూ అమలు చేసి విద్యార్థుల తల్లి ఖాతకు జమ చేసేవారు.అయితే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ పధకాన్ని పీజీ చదివే పిల్లలకు రద్దు చేశారు. అప్పట్లో అదొక సంచలనంగా మారింది.అయితే దాంట్లో భాగంగా జగన్ ప్రభుత్వం విద్యదివేన తో పాటు వసతి దీవెన అనేది వారి వ్యక్తిగత ఖర్చుల కోసం ఇచ్చింది.ప్రస్తుతం ఈ ఎన్నికల్లో భారీ స్థాయిలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక మరల ఈ పధకానికి పేరు మార్చి పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్గా అమలు చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అయితే ఈ ప్రభుత్వం మాత్రం గత ప్రభుత్వం లాగా తల్లి ఖాతాకి జమ చేయకుండా కళాశాలల యాజమాన్యం ఖాతాకి జమ చేయాలి అనే ఆలోచనకు వచ్చినట్లు సమాచారం.ఏదైతేనేం అధికారంలోకి ఎవరొచ్చిన ఫీ రీ ఎంబర్స్మెంట్ పధకం అనగానే ప్రజలకు గుర్తొచ్చే మహనేతగా ప్రజల మదిలో వైయస్సార్ నిలిచారు అనడంలో సందేహం లేదు. ఈ పధకం ద్వారా ఆయన వేసిన బీజాలే ఈ రోజు మహావృక్షాలుగా ఏదిగాయి అనడంలో ఆశ్చర్యం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: