* రాజీవ్ ఆరోగ్యశ్రీ గా మొదలు పెట్టిన వైఎస్ఆర్
 
* పేదలకు వరంలా మారిన ఆరోగ్యశ్రీ పధకం
 
* చరిత్రలో నిలిచిపోయే పధకంగా గుర్తింపు..



ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా అభివృద్ధి కంటే ఉచిత పధకాలకే డిమాండ్ పెరిగింది. ప్రభుత్వం మారితే వున్న పధకాలకు పేరు మార్చడం అయిన జరుగుతుంది. లేదా కొత్త పధకాలు రావడం అయినా జరుగుతుంది. ప్రజలను ఆకట్టుకున్న పధకాలను నిలిపివేయడానికి ఏ ప్రభుత్వం కూడా సాహసం చేయడం లేదు..ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి భారీగా సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణస్వీకారం చేసి తన మార్కు పాలన చూపిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధిపై ఆయన దృష్టి పెట్టారు. శిధిలమైన అమరావతిని తిరిగి పునః నిర్మించే పనిలో నిమగ్నమై వున్నారు. దానిలో భాగంగా రాజధానిని ఇక ఏ ప్రభుత్వం టచ్ చేయని విధంగా బలంగా చట్టాలని తీసుకొస్తున్నారు. దీనితో భవిష్యత్ లో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన రాజధానిని మార్చడానికి ఉండదు.. ఇదిలా ఉంటే గత ఐదేళ్లుగా వైసిపి నేతలపై ప్రతికారం తీర్చుకునేందుకు టీడీపీ నేతలు కార్యకర్తలు ఎదురు చూసారు.కూటమి గెలిచిన మరుక్షణం నుంచే వైసీపీ నేతలకు చుక్కలు చూపించడం మొదలు పెట్టారు..


అప్పట్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి జగన్ తప్పు చేశారు. ఆయన ఓడిపోవడానికి అది కూడా బలమైన కారణం అని చెప్పాలి. తాజాగా జగన్ ప్రవేశపెట్టిన పధకాలకు పేరు మార్చే పనికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది..ఇందులో భాగంగా ఏపీ ఆరోగ్య శ్రీ పథకం పేరు మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నందమూరి తారక రామారావు ఆరోగ్య సేవగా మారుస్తూ వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేసారు.గతంలో ఈ పధకాన్ని రాజీవ్ ఆరోగ్య శ్రీ  గా 2007లో దివంగత మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టారు..ఆ తరువాత టీడీపీ ప్రభుత్వం ‘ఎన్టీఆర్ వైద్యసేవ’ పేరుతో కొనసాగించింది.జగన్ ప్రభుత్వం వచ్చాక ఆ పధకానికి డా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని పేరు మార్చింది. తాజాగా కూటమి ప్రభుత్వం డా. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ పేరును మార్చింది. నందమూరి తారకరామారావు వైద్య సేవా ట్రస్ట్‌గా పేరు మార్పు చేసింది.


ఆరోగ్యశ్రీ పథకం ముఖ్యంగా అర్హులైన పేద రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ప్రవేశపెట్టారు. వైద్య సేవలందించడంతో పాటు రవాణా, భోజన వసతి సదుపాయాలను కూడా కల్పిస్తారు. ఈ పథకం ద్వారా 2014 సెప్టెంబర్ నాటికి 25 లక్షల మంది పేద రోగులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు చేశారు.అలాగే ఈ పథకం కింద 1038 పైగా జబ్బులకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందించబడ్డాయి. ముఖ్యంగా ఈ పథకం ద్వారా ప్రజారోగ్యమే ప్రధాన ఉద్దేశంగా సేవలను అందిస్తూ అన్ని రోగాలకు వైద్యం అందించడం జరిగింది.గతంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి 2.5 లక్షలవరకు వర్తింపు చేశారు.దారిద్యరేఖకు దిగువన ఉన్న పేదవారికి ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేసింది. ఈ కార్డుల ద్వారా ఆరోగ్యశ్రీ పథకం కింద సేవలందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యసేవలను పొందవచ్చు.తాజాగా పేరు మారిన ఎన్టీఆర్ వైద్య సేవ పధకంలో భాగంగా గతంలో అందించిన సేవలతో పాటుగా మరిన్ని సేవలని అందించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: