ఏపీలో తన కార్యకలాపాలను భారీగా విస్తరించే దిశగా హెచ్.సీ.ఎల్ అడుగులు వేస్తోంది. ఐటీ మంత్రి నారా లోకేశ్ తో హెచ్.సీ.ఎల్ కంపెనీ ప్రతినిధులు భేటీ కాగా 15 వేల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు పడ్డాయి. టీడీపీ గతంలో అధికారంలో ఉన్న సమయంలో హెచ్.సీ.ఎల్ 4500 మందికి ఉద్యోగాలు కల్పించింది. హెచ్.సీ.ఎల్ సంస్థ విస్తరణ ద్వారా మరో 5000 మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. ఫేజ్2 లో భాగంగా కొత్త కార్యాలయం నిర్మాణం చేపట్టి మరో 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని సంస్థ ప్రతినిధులు చెప్పుకొచ్చారు.
అధునాతన సాంకేతిక సేవలను అందుబాటులోకి తెచ్చి పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం అందుతోంది. ఏపీ ప్రభుత్వం అమలు చేయనున్న స్కిల్ సెన్సస్, స్కిల్ డెవలప్మెంట్ లో తాము కూడా భాగస్వామ్యం కానున్నామని సంస్థ ప్రతినిధులు చెప్పుకొచ్చారు.
ఏపీలో 20 లక్షల ఉద్యోగాలను కల్పించడానికి తమ వంతు సహాయసహకారాలు అందిస్తామని సంస్థ ప్రతినిధులు కామెంట్లు చేశారు. హెచ్.సీ.ఎల్ సంస్థ తీసుకున్న నిర్ణయం విషయంలో ఏపీ నిరుద్యోగుల నుంచి ప్రశంసల వర్షం కురిపిస్తుండటం గమనార్హం. ఏపీ మంత్రి లోకేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు మేలు జరిగేలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రశంసలు అందుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరిన్ని సాఫ్ట్ వేర్ కంపెనీల ఏర్పాటు దిశగా అడుగులు పడనున్నాయని సమాచారం అందుతోంది. ఏపీ అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.