ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ అప్‌డేట్ కోసం ప్రజలు 2 నెలలుగా ఎదురుచూస్తున్నారు. మరి ప్రభుత్వం ఏమందో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కుదురుకుంటోంది. ఈ 2 నెలలూ చాలా సవాళ్లను పరిష్కరిస్తూ వచ్చింది. ప్రభుత్వం ముందు భారీ సవాళ్లు చాలా ఉన్నాయి. గ్యారెంటీ పథకాల అమలు లక్ష్యం అలాగే ఉంది. పెట్టుబడుల కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేస్తూ, కొత్తగా ఏం చెయ్యాలో అవన్నీ చేస్తూ ముందుకు సాగుతోంది కూటమి సర్కార్. ఐతే.. కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారనే ప్రశ్న ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.వైసీపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి దరఖాస్తులు స్వీకరించింది కానీ… కార్డులు జారీ చెయ్యడాన్ని సంవత్సరం కిందటే ఆపేసింది.కొత్త ప్రభుత్వం రాగానే.. కొత్త రేషన్ కార్డుల కోసం డిమాండ్ తెరపైకి వచ్చింది. దాంతో.. కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పింది.ఈ నేపధ్యం లోనే ఆంధ్రప్రదేశ్‌లోని ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేకంగా రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు.

అమరావతిలోని సచివాలయంలో ఏపీ సాంఘిక సంక్షేమశాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమంపై సమీక్ష జరిపారు. ఈ వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగానే ట్రాన్స్‌జెండర్లకు రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని, అధికారులు అలసత్వం వీడి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సచివాలయంలో విభిన్న ప్రతిభావంతులు, వయో వయోవృద్దులు, ట్రాన్స్ జెండర్స్ సంక్షేమంపై మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్స్కి కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. అంధ విద్యార్థులకు ఒకేషనల్, నైపుణ్యాభివృద్ధి కోర్సులు ప్రవేశపెట్టాలని మంత్రి సూచించారు. ట్రాన్స్ జెండర్లు గుర్తింపు కార్డులు తీసుకునేలా అవగాహన కల్పించాలి. ట్రాన్స్ జెండర్లకి ప్రత్యేకంగా రేషన్ కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ట్రాన్స్ జెండర్లతో స్వయం సహాయక బృందాల ఏర్పాటుకు ప్రోత్సహించాలని మంత్రి అధికారులకు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: