ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే.. పాతకాలపు ఫ్రాక్షన్ రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. ఏ పార్టీ నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు.. ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్లే వ్యాపారం చేసుకునేలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మారిపోయింది.. అధికారం లేని  వాళ్ళందరూ కూడా రాష్ట్రం వదిలి పోవాలా లేదా ఇళ్లల్లో దాక్కొని ఉండాల్సిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. అలాగే రౌడీయిజం ఏరియాలలో కూడా ఇదే జరుగుతోంది. మధ్యలో ఎవరైనా తటస్తులు ఉంటే కనుక వీలైతే ఖచ్చితంగా అన్ని వదిలేసి వెళ్లిపోవలసి ఉంటుంది.



గతంలో 1970 నుంచి 1995 వరకు సాగినటువంటి రౌడీయిజం, ఫ్యాక్షనిజం వంటివి మళ్లీ ముంచుకొస్తోంది. ఇప్పుడు గనుల విషయంలో కూడా ఇదే జరుగుతోంది. కూటమి అధికారంలోకి రాగానే ఇసకది కూడా ఆల్రెడీ తీసేసుకున్నారు. ఇప్పుడు  గనుల వద్దకు వెళ్తున్నారు గతంలో తెలుగుదేశం పార్టీని పక్కకు పంపించి వైసిపి పార్టీ వాళ్లు గనులు తీసుకుంటే ఇప్పుడు మళ్లీ వైసిపి వాళ్ళను పక్కకు పంపించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని తీసుకుంటున్నారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి వారంతా తెలుగుదేశం చేరదీసింది.. మాట విననటువంటి వారందరినీ బెదిరించి టిడిపి పార్టీలోకి చేర్చుకున్నారు



ఇప్పుడు అదే మళ్లీ జరుగుతోంది. దీంతో ఇప్పుడు వైసీపీ పార్టీ నేతలు సైతం గనులు వదిలేసి మళ్లీ అవతల వైపు వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడినట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇవే కాకుండా చాలా చోట్ల కూడా టిడిపి నేతలు తమ హవా చూపిస్తూ అన్నిటిని సైతం తీసేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చాలామంది వైసిపి నేతలు కూడా ఇలాంటి విషయాల పైన కూడా సైలెంట్ గా ఉంటున్నారు. చాలామంది కూటమి నేతలు అటు టిడిపి జనసేన బిజెపి నేతలు, కార్యకర్తలు కూడ వైసిపి పార్టీ నేతల మీద కార్యకర్తల మీద కాస్త కోపంగానే ఉన్నారు.. ముఖ్యంగా వైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయారని విధంగా కూడా వార్తలు వినిపించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: