తెలంగాణలోని ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టుకు వెళ్లిన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి కి గట్టి షాక్ తగిలింది.గతంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఓటుకు నోటు కేసు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఏళ్లు గా సంచలనంగా మారింది. ప్రస్తుతం తెలంగాణ సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం గా ఉన్న నారా చంద్రబాబు నాయుడులపై.. ఈ ఓటుకు నోటు కేసులో ఎప్పటి నుంచో ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబుపై దాఖలు చేసిన రెండు పిటిషన్లను తాజాగా సుప్రీంకోర్టు కొట్టివేసింది. వైఎస్సార్‌సీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఈ ఓటుకు నోటు కేసుకు సంబంధించి.. చంద్రబాబుపై వేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అదే సమయంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ కక్షలకు కోర్టులను వేదిక చేసుకోవద్దని.. ఆళ్ల రామకృష్ణారెడ్డికి సూచించింది.ఓటుకు నోటు కేసు లో వైసిపి నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ఓటుకు నోటు కేసులో సిబిఐ విచారణను కోరుతూ ఆయన పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆళ్లను మందలించింది.పిటిషనర్‌ రాజకీయ నేపథ్యంపై కూడా ఆరా తీసిన ధర్మాసనం.. 2014 నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపారు.

ప్రస్తుతం ఆళ్ల ఉన్న పార్టీ ప్రత్యర్థిగా ఉందని న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టుకు తెలిపారు.ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టులో వేరే పిటిషన్లు కూడా ఉన్నాయని ఆళ్ల తరఫు న్యాయవాది ఓ జాబితా పెట్టగా.. ఆ కేసులకు, ఇప్పుడు వాదనలు జరుగుతున్న కేసులకు సంబంధం లేదని సిద్ధార్థ లూథ్రా పేర్కొన్నారు. కేసుల జాబితా చూశాక పిటిషనర్‌ రామకృష్ణారెడ్డిపై ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుల్లో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అంశాలు కనపడటం లేదని తెలిపింది. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి, సత్తా చాటుకోవాలి తప్ప రాజకీయ కక్షల కోసం కోర్టులకు రావద్దంటూ సుప్రీంకోర్టు జడ్జి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా కక్షలు ఉంటే బయట చూసుకోవాలని… కోర్టులను వేదికగా చేసుకోవద్దని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది. రాజకీయంగా బలం ఉంటే మళ్లీ పోటీ చేసి గెలవాలని ఆళ్ల రామకృష్ణారెడ్డికి హితవు పలికింది. ఈ సందర్భంగా పిటిషనర్‌కు ఉన్న అర్హత, రాజకీయ నేపథ్యంపై ధర్మాసనం ఆరా తీసింది. పిటిషనర్‌కు హెచ్చరికలు జారీ చేసింది.దాదాపు పదేళ్ల క్రితం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన ఓటుకు నోటు కేసుపై ఆళ్ల సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, కేసు దర్యాఫ్తును సిబిఐకి అప్పగించాలని వేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు ఈరోజు కొట్టివేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: