* రాజకీయంగా పెను దుమారం రేపిన తెలంగాణ యువకుడు యాది రెడ్డి మరణం

* ఏకంగా ఢిల్లీ రాజకీయాలు సైతం ఉలిక్కి పడేలా చేసిన యాది రెడ్డి ఘటన

* రాజకీయ రచ్చకు దారితీసిన దళిత ఉద్యోగి పై హరీష్ రావు దాడి…




ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఎన్నో విషాద సంఘటనలు జరిగాయి.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎందరో అమరవీరులు తమ జీవితాలను త్యాగం చేశారు.. ప్రత్యేక రాష్ట్రం సాధనే లక్ష్యంగా వారు తీవ్రంగా శ్రమించారు...అయితే తెలంగాణ రాష్ట్రం కోసం యాది రెడ్డి అనే యువకుడు ఆత్మ హత్య చేసుకోవడం అప్పట్లో కలకలం రేపింది.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఢిల్లీకి వెళ్లి ఇండియా గేట్ సమీపంలో యాది రెడ్డి చెట్టుకు ఉరి వేసుకొని  ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ ఘటనతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.. ఆంధ్ర పెట్టుబడి దారుల మూలానా ఎంతమంది తెలంగాణ యువకులు బలికావాలి అని అప్పట్లో ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి.. అప్పుడు కేంద్రంలో అధికారంలో వున్న కాంగ్రెస్ కు యాది రెడ్డి ఆత్మహత్య తలనొప్పిగా మారింది..


అయితే యాది రెడ్డి మృతదేహం తరలింపు పై అప్పట్లో తీవ్ర వివాదం చెలరేగింది..ప్రజలు నివాళులర్పించేందుకు వీలుగా యాదిరెడ్డి మృతదేహాన్ని ఏపీ భవన్‌లోనే ఉంచాలని టీఆర్‌ఎస్ డిమాండ్ చేయడంతో ఈ దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే మృతదేహాన్ని నేరుగా హైదరాబాద్‌కు తరలించి యాదిరెడ్డి కుటుంబసభ్యులకు అప్పగించాలని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ అధికారులను ఆదేశించారు.తెలంగాణ నేతలకు సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని తరలించడంతో ఆగ్రహించిన హరీశ్‌రావు తన మద్దతుదారులతో కలసి ఊరేగింపుగా ఏపీ భవన్‌కు చేరుకుని అక్కడ ఉద్యోగి అయిన చందర్‌రావుతో తీవ్ర వాగ్వాదానికి దిగారు.

తెలంగాణ నేతలకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని ఎందుకు తరలించారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.దీనితో గొడవ మరింత పెరిగి ఆ ఉద్యోగిపై హరీష్ రావు చేయి చేసుకునేంత వరకు వెళ్ళింది..దీనితో ఏపీ భవన్ ఉద్యోగులు అంతా కూడా నిరసనకు దిగారు. ఆ ఉద్యోగి స్వయానా దళితుడు కావడంతో గొడవ కాస్త పెద్దడైంది.. ఆ అధికారికి క్షమాపణలు చెప్పాలని ఉద్యోగులంతా నిరసన చేపట్టారు. ఈ గొడవ అప్పట్లో తీవ్ర కలకలం రేపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: