వైఎస్ జగన్ ను పొలిటికల్ గా, వ్యక్తిగతంగా అభిమానించే అభిమానులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. అదే సమయంలో వైఎస్ జగన్ ను ఎంతగానో విమర్శించే వాళ్లు ఉన్నారు. అయితే ఒకే ఒక్క ఘటన మాత్రం వైఎస్ జగన్ పొలిటికల్ కెరీర్ లో చెరిగిపోని మచ్చగా నిలిచింది. హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్సార్ మరణించిన సమయంలో జగన్ ఎమ్మెల్యేలతో తనను సీఎం చేయాలంటూ సంతకాలు చేయించుకున్నారని అప్పట్లో వార్తలు వినిపించాయి.
 
అక్రమాస్తుల కేసులో జగన్ అరెస్ట్ అయిన సమయంలో సైతం జగన్ ను విడుదల చేయాలంటూ కోటి సంతకాల సేకరణ చేపట్టడం అప్పట్లో ఒకింత సంచలమైంది. తాను తప్పు చేయలేదని ఆధారాలు చూపించి ప్రూవ్ చేసుకోకుండా సంతకాల సేకరణ చేపట్టడం ఏంటనే కామెంట్లు సైతం వినిపించాయి. తండ్రి మరణిస్తే ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించి జగన్ తన పొలిటికల్ కెరీర్ లో సరిదిద్దుకోలేని తప్పు చేశారు.
 
జగన్ చిన్న వయస్సులోనే ఎంపీ అయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసి సంక్షేమ పథకాల అమలు ద్వారా మాత్రమే ఈ కష్టాలు తీరతాయని భావించారు. అయితే పాదయాత్రకు వచ్చి తనను కలవని మిడిల్ క్లాస్ వ్యక్తుల కష్టాలను, విద్యార్థులు యువత సీఎం నుంచి ఆశించే వాటిని నెరవేర్చే విషయంలో జగన్ పూర్తిస్థాయిలో ఫెయిల్ అయ్యారు.
 
2024 ఎన్నికల్లో వైసీపీకి 11 స్థానాలు వస్తాయని ఆ పార్టీ నేతలు సైతం కలలో కూడా ఊహించలేదు. పార్టీ నెమ్మదిగా పుంజుకుంటున్నా ఇప్పట్లో పూర్తిస్థాయిలో పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదు. కూటమి పాలన మరీ దారుణంగా ఉంటే తప్ప జగన్ కు సీఎంగా మరో ఛాన్స్ దక్కడం కష్టమేనని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సంక్షేమ పథకాలతో జగన్ ప్రజల హృదయాలకు దగ్గరైనా అన్ని వర్గాల ప్రజలను మెప్పించే విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యారనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: