ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ మెడకు మరో వివాదం చుట్టుకుంది. ఏపీలో ఎగ్ పఫ్.. వివాదాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైపు నెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఏపీలో అధికారం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డిని అన్ని విధాల.. ఇబ్బంది పడుతోంది తెలుగుదేశం ప్రభుత్వం. ఇక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ జగన్మోహన్ రెడ్డిని.. అలాగే వైసిపి నేతలను ఇరికించే ప్రయత్నం జరుగుతుంది.

 

వైసిపి నేతలపై కేసులు పెట్టడం, వైసిపి పార్టీ కార్యాలయాలకు నోటీసులు అంటించడం కూడా జరుగుతుంది. ఇప్పటికే పెద్దిరెడ్డి మరియు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి  ఇటు జోగి రమేష్ కుటుంబాన్ని కూడా  ఫుట్బాల్ ఆడుకుంటుంది తెలుగుదేశం ప్రభుత్వం. అయితే ఇలాంటి నేపథ్యంలో.. ఎగ్ పఫ్  వివాదం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశం అయింది. అది కూడా వైసిపి పార్టీ మెడకు ఎగ్ పఫ్ వివాదం చుట్టుకుంటోంది.

 

వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్...  ఇటు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎగ్ ఫఫ్ బాగా తినేవారని సోషల్ మీడియాలో ప్రచారం భారీగా జరుగుతుంది. అయితే వీటిని తినేందుకు ఐదు సంవత్సరాలలో 3.62 కోట్లు ఖర్చు చేసినట్లు కూడా... ఎల్లో మీడియా ప్రచారం చేస్తుందని వైసీపీ చెబుతోంది.

 

సీఎం క్యాంప్ ఆఫీసులో అలాగే ఆయనకు సంబంధించిన ఉద్యోగులందరూ...  ఒక రోజుకు సగటున 993 ఎగ్ ఫఫ్స్ తిన్నారని... దీనికోసం ఒక్క సంవత్సరానికి 18 లక్షల రూపాయలు  ఖర్చు పెట్టారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై వెంటనే విచారణ జరిపి.. ఆ ఖర్చును వసూలు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై వైసీపీ నేతలు తీవ్రం గా మండిపడుతున్నారు. ఒక రోజుకు 933 ఎ లా తింటారని ప్రశ్నిస్తున్నారు.ఇదంతా తెలుగుదేశం పార్టీ ప్రచారమని అంటున్నారు. మరి ఈ వివాదం పైన జగన్‌ మోహన్‌ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: