ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్రీ బస్ స్కీమ్ అమలు కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఆగష్టు నెల 15వ తేదీ నుంచి ఈ స్కీమ్ అమలవుతుందని అందరూ భావించినా ఊహించని ఫ్రీ బస్ ప్రయాణం విషయంలో బాబు మార్క్ ట్విస్టులు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి . ఇతర రాష్ట్రాల్లో మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ అమలవుతున్న తీరుపై అధ్యయనం చేయాలని చంద్రబాబు తెలిపారు.
 
అధికారులు, ప్రజా ప్రతినిధులతో కూడిన కమిటీ ఆయా రాష్ట్రాలలో పర్యటించి నివేదికను రూపొందించాలని చెప్పుకొచ్చారు. ఫ్రీ బస్ స్కీమ్ కొంత ఆలస్యమైనా లోపాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కామెంట్లు చేయడం గమనార్హం. అయితే ఏపీలో ఈ స్కీమ్ ఎప్పుడు అమలైనా కేవలం జిల్లాల వరకు మాత్రమే అమలు కానుందని సమాచారం అందుతోంది.
 
ఫ్రీ బస్ స్కీమ్ అమలు విషయంలో ఇంతకు మించిన షరతు అవసరం లేదనే సంగతి తెలిసిందే. ఇప్పట్లో ఈ స్కీమ్ అమలు కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇంకెన్ని రోజులు ఈ స్కీమ్ గురించి అధ్యయనం చేస్తారని జనాలను మభ్యపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
ఫ్రీ బస్ స్కీమ్ అమలును ఆలస్యం చేయడం వల్ల బాబు సర్కార్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇతర స్కీమ్స్ తో పోల్చి చూస్తే ఈ స్కీమ్ అమలుకు ఖర్చు కూడా తక్కువేనని తెలుస్తోంది. ఇంకెంత కాలం ఈ స్కీమ్ ను ఆలస్యం చేస్తారో చూడాలి. 2025 సంవత్సరం జనవరి నెల నుంచి ఈ స్కీమ్ ను అమలు చేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఫ్రీ బస్ స్కీమ్ వల్ల మహిళలకు ఎలాంటి ఖర్చు లేకుండా జిల్లాలోని ఇతర ప్రాంతాలకు ట్రావెల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. బాబు తక్కువ బడ్జెట్ తో అమలయ్యే పథకాలను వేగంగా అమలు చేస్తే మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: