* బ్లూఫిల్మ్‌లో యాక్ట్ చేసిన దానివి అంటూ రోజాపై కామెంట్స్

* బండారు సత్యనారాయణమూర్తి దిగజారుడు కామెంట్స్‌పై సర్వత్రా వ్యతిరేకత

* ఆయనపై పడిన ఈ మచ్చ జీవితంలో తొలగిపోదు  

(ఏపీ - ఇండియా హెరాల్డ్)

రాజకీయాల్లోకి ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు. కొందరు మంచి పనులు చేస్తూ మంచిగా మాట్లాడుతూ ప్రజల్లో మంచి లీడర్‌గా నిలిచిపోతారు. కొందరు మాత్రం ఏదో ఒక సందర్భంలో ఎవరికి నచ్చని పనులు చేసి, లేదంటే కామెంట్స్ చేసి చెడ్డవారిగా మిగిలిపోతారు. వారిపై పడిన మచ్చ అనేది శాశ్వతంగా అలాగే ఉండిపోతుంది. వాళ్లను చూడగానే వాళ్లు చేసిన తప్పు, లేదంటే చెడు కామెంట్సే మనకి గుర్తొస్తాయి. ఇలాంటి నేతల్లో ముఖంగా చెప్పుకోవాల్సిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనే మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి.

ఈయన టీడీపీ ఫైర్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. కానీ కొన్నిసార్లు మాటలు హద్దులు దాటుతుంటాయి. వైసీపీ హయాంలో ఉన్న సమయంలో కూడా బండారు కాంట్రవర్షల్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజాపై దిగజారుడు కామెంట్స్ చేశారు. ఈ టీడీపీ సీనియర్ లీడర్ చేసిన కామెంట్స్‌ను కేవలం వైసీపీ వాళ్లు మాత్రమే కాకుండా న్యూట్రల్ పీపుల్, అలాగే టీడీపీ సపోటర్లు కూడా తీవ్రంగా ఖండించారు. రాజకీయంగా ఆయన విమర్శిస్తే ఎవరూ అడ్డు చెప్పారు కానీ రోజా క్యారెక్టర్‌ని అస్సాసినేట్ చేసే విధంగా ఆయన కామెంట్స్ ఉన్నాయి. ఇంతకీ అప్పుడు ఆయన ఏం మాట్లాడారో తెలుసుకుందాం.

"రోజా నీ బతుకు ఎవడికి తెలియదు. బ్లూ ఫిల్మ్‌లో నటించిన దానివి. ఆ బ్లూ ఫిల్మ్ వీడియోలు మా వద్ద ఉన్నాయి. కానీ బయటపెట్టకూడదని అనుకున్నాం. అందుకే ఎప్పుడూ విడుదల చేయలేదు. మరి ఇప్పుడు నీ బతుకు ఏంటో ప్రజలకు చూపించమంటావా? రికార్డింగ్ డ్యాన్సులు, కిరాయికి డ్యాన్సులు వేసే నువ్వు లక్కు బాగుండి మంత్రి అయిపోయావు. ఇప్పుడు ఇష్టారాజ్యంగా మాట్లాడతావా?" అంటూ బండారు కాంట్రవర్షల్ కామెంట్స్ చేశారు.

అప్పట్లో ఈ మాటలకు రోజా కన్నీటి పర్యంతమయింది. ఒక మహిళ వ్యక్తిత్వాన్ని కించపరిచే స్థాయిలో ఆయన ఎలా మాట్లాడుతాడు అంటూ వాపోయింది. గుంటూరు పోలీసులు అతన్ని అరెస్ట్ కూడా చేశారు. తర్వాత హైకోర్టులో ఆయనకు బెయిల్ వచ్చింది. అలా బయటకు వచ్చాక తాను చేసిన మాటల్లో ఎలాంటి తప్పు లేదంటూ సమర్దించుకున్నారు..లోకేష్ ని రోజా తిట్టడం వల్లే తాను ఆమెను అలా అన్నానని వివరణ ఇచ్చుకున్నారు. ఏది ఏమైనా ఈ కామెంట్స్ చేయడం వల్ల ఆయనకు ఎక్కువగా నెగెటివిటీనే వచ్చింది. ఆయన క్యారెక్టర్ పై ఒక మచ్చ పడిపోయింది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమే కానీ మరీ ఇలా మహిళల వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేయడం తప్పు అని చాలామంది పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: