పాయకరావుపేట ఎమ్మెల్యే, ఏపీ హోమ్ మంత్రి వంగలపూడి అనిత కొన్ని ఏళ్ల క్రితం అసెంబ్లీలో బోరున ఏడ్చేశారు. దళిత మహిళను అయినందుకే రోజా తనని వ్యక్తిగతంగా దారుణంగా దూషించిందంటూ ఆమె కన్నీరు కార్చారు. ఆ సమయంలో రోజాని అసెంబ్లీ నుంచి ఒక సంవత్సరం సస్పెండ్ చేశారు.

2015 ఏపీ అసెంబ్లీ సమావేశంలో వంగలపూడి అనిత మాట్లాడుతూ "రోజా చాలా దారుణంగా మాట్లాడుతోంది. చీర ఎత్తి తన కాలు చూపించి నువ్వు నా కాలి గోటికి కూడా సరిపోవు అంటూ రోజా మాట్లాడింది. ఆడదని కూడా మర్చిపోయి బుచ్చయ్య చౌదరి, అచ్చయ్య నాయుడు, గంటా శ్రీనివాస్‌లపై కూడా నీచమైన వ్యాఖ్యలు చేసింది. ఈరోజు ఆమె మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునేలాగా ఉన్నాయి. నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు వారికి ఏం సమాధానాలు చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో నేను ఉన్నా. నేను చదువుకొని ఒక గౌరవమైన ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చాను. నువ్వు (రోజా) ఎక్కడి నుంచి వచ్చావో గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రోజా ఈరోజు నన్ను అవమానించింది రేపు భారతి, విజయమ్మ, షర్మిలమ్మ పై కూడా ఇలాంటి కామెంట్స్ వస్తాయి. రోజా లాంటి వారిని అలాగే వదిలేయకూడదు." అంటూ మాట్లాడారు.

రోజా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తుండటం వల్ల పేపరు, టీవీ చూడాలంటేనే తాము, తమ పిల్లలను భయపడిపోయామని అప్పట్లో అనిత కామెంట్లు చేశారు. పీతల సుజాత గురించి అసెంబ్లీ సాక్షిగా రోజా వికృత చేష్టలు అసభ్యకరమైన మాటలు మాట్లాడిందని ఆమె ఆరోపించారు. ఆమె బాడీ లాంగ్వేజ్ ప్రవర్తన చాలా అసభ్యంగా ఉంటాయని కూడా అనిత షాకింగ్ కామెంట్స్ చేశారు. 2015 కాలంలో రోజా అసెంబ్లీలో ఎలాంటి చేష్టలు చేశారు కొన్ని వీడియో విజువల్స్ కూడా వైరల్ అయ్యాయి. కొంచెం రఫ్ గా ఆమె రెచ్చిపోయిన విజువల్స్ చూసి చాలామంది షాక్ అయ్యారు. ఇది ఆమెను వ్యక్తిత్వం పై మచ్చ తెచ్చి పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: