* అసెంబ్లీ సాక్షిగా వ్యక్తిగత అవమానాన్ని ఎదుర్కొన్న బాబు..!
* కన్నీటి పర్యమైన రాజకీయా మేటి చంద్రబాబు.!
* ప్రజల గుండెలను కుదిపేసిన చంద్రబాబు భావొద్వేగం.!

(ఆంధ్రప్రదేశ్-ఇండియాహెరాల్డ్ ): ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలకు దాటింది. అయితే ఈసారి మాత్రం ఎలగైనా సరే గత అధికార పార్టీ వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాలనే లక్ష్యంతో మంచి ప్రణాళిక వేసుకొని టిడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ మరియు బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి గారు అందరుకలిసి కట్టుగా విజయం సాధించి కూటమి మొత్తం 164స్థానాలు గెలిచి జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కనికుండా 11స్థానాలకే పరిమితం చేశారు అయితే కూటమి అధికారంలోకి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన ఒక అంశం చంద్రబాబు గారు ఒకానొక సందర్భంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శాసనసభ సాక్ష్యంగా చంద్రబాబు నాయుడుగారి భార్య అయినా పురందేశ్వరి గూర్చి అనరాని మాటలు అనడంతో చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి భావొద్వేగానికి లోను కావడం.ఆ విషయం రాష్టం అంత సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్లడం 75సంవత్సరాల రాజకీయ ఘనుడు,వయసు రీత్యా పెద్దవాడు అయినా నాయకుడు చంద్రబాబు గారు అలాంటి వారు కన్నీళ్లు పెట్టుకోవడంతో ప్రజల్లో సానుభూతి బాగా కలిసి రావడం అనేది జరిగింది.

ఎన్నికలకు ముందు ఏపీలో రాజకీయాలు బాగా వేడెక్కాయి. అయితే అప్పట్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కుప్పంలో చంద్రబాబు టీడీపీని గెలిపించుకోవడంలో విఫలం కావడంతో అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ చంద్రబాబును ఆడుకుంది.అసెంబ్లీలో  వైసీపీ సభ్యులు,మంత్రులు చంద్రబాబును టార్గెట్ చేసి అవమానానిస్తే చంద్రబాబు అసెంబ్లీని బహిష్కరించి వెల్లిపోతూ సీఎం అయ్యాకే తిరిగి అడుగుపెడతానని శపధం చేసారు.నలభయ్యేళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు జరిగిన అవమానం ప్రజల్ని కుదుపేసింది. ఒక దశలో మంత్రి కొడాలి నాని లుచ్చా అంటూ చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు అలాగే వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పేరు ప్రస్తావిస్తూ విమర్శలకు దిగారు.

అసెంబ్లీలో జరిగిన పరిణామాల్ని తల్చుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసి అసెంబ్లీలో వైసీపీ తీరు చాలా దారుణంగా ఉందని తాను ఎంతో సంయమనంగా ఉన్నా సీఎం జగన్ తనను పదే పదే రెచ్చగొట్టారని చంద్రబాబు తెలిపారు.విపక్షంలో ఉన్నవారిని తానెప్పుడూ అవమానించలేదని చంద్రబాబు గుర్తుచేసి ప్రజల కోసం చేసేదే రాజకీయమని అన్నారు. ఎన్టీఆర్ వంటి వారు సభలో తనకు అవమానం జరిగితే అక్కడే చెప్పి బయటికి వచ్చారన్నారు. కానీ తనకు జరిగిన అవమానంపై తప్పని చెప్పకుండా స్పీకర్ వైసీపీ ఎమ్మెల్యేలను ప్రోత్సహించారని చంద్రబాబు తెలిపారు. తనకు మైక్ ఇవ్వకుండా అవమానించారని, చివరకు మైక్ ఇచ్చి మధ్యలో కట్ చేసి అవమానించారని పేర్కొన్నారు. తనకు ఎలాంటి పదవులు, రికార్డులు అక్కర్లేదని, తన రికార్డు బద్దలు కొట్టాలన్నా సమయం పడుతుందని చంద్రబాబు తెలిపారు.

తన భార్య ఎప్పుడూ రాజకీయాల్లోకి రాలేదని అలాంటి వ్యక్తిపై వైసీపీ వ్యాఖ్యల విమర్శలు బాధించాయని అందుకే తాను భావొద్వేగానికి లోను కావాల్సి వచ్చిందని అన్నారు.తన పని, వ్యక్తిగత జీవితం, తనను ప్రోత్సహించడం తప్ప మరో విషయం తెలియని వ్యక్తి అని చంద్రబాబు అన్నారు. అలాంటి వ్యక్తిని సైతం వ్యక్తిత్వ హననానికి వచ్చారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.ఈసంఘటన అనేది ఎప్పటికి అటు టీడీపీ నేతలకు అలాగే వైసీపీ నాయకులకు ముఖ్యంగా ప్రజలకు ఎప్పుడైనా సరే కళ్ళ ముందు ఉన్నట్లుగా కనబడుతుంది. అయితే దాంతో చంద్రబాబు పేరు విన్న ఆయన కనబడిన మనకు గుర్తొచ్చే అంశంలో అదొకటి అని ప్రజలు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: