ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. 164 సీట్లను దక్కించుకున్న తెలుగుదేశం కూటమి.... వైసీపీని మట్టి కరిపించింది. 175 సీట్లకు 175 సీట్లు గెలుస్తామని.. ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి...చాలానే చెప్పారు. కానీ ఫలితం 11 స్థానాలకు మాత్రమే వైసిపి పార్టీ చేరుకోగలిగింది. ప్రతిపక్ష హోదాకు 18 స్థానాలు కచ్చితంగా ఉండాలి.


కానీ ఆ సంఖ్యను కూడా వైసిపి చేరుకోలేదు. ఇక ఇటు తెలుగుదేశం సొంతంగా 135 స్థానాలు గెలుచుకుంది. జనసేన పార్టీ 21 స్థానాలు గెలుచుకోగా భారతీయ జనతా పార్టీ ఎనిమిది సీట్లు విజయం సాధించింది... బిజెపి పోటీ చేసిన ప్రతి చోట విజయం సాధించి... గతంలో కంటే మెరుగుపడింది.  అయితే ఈ ఆంధ్రప్రదేశ్ బిజెపి పార్టీలో... తీవ్ర అసంతృప్తి నెలకున్నట్లు సమాచారం అందుతుంది.


అసలు ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలు  పురందరేశ్వరి  అంటే ఏపీ బీజేపీ నేతలకు పడటం లేదట. సోము వీర్రాజును పక్కకు జరిపిన తర్వాత... ఏపీ అధ్యక్షురాలుగా పురందరేశ్వరి బాధ్యతలు తీసుకున్నారు. వాస్తవంగా తెలుగుదేశం మూలాలు ఉన్న నాయకురాలుగా... పురందరేశ్వరికి గుర్తింపు ఉంది. దీంతో బిజెపి నేతలు ఆమె..  నియామకాన్ని వ్యతిరేకిస్తున్నారట.

ఇక తెలుగు దేశం కూటమి అధికారం లోకి వచ్చిన తర్వాత... ఏపీ అధ్యక్ష పదవి.. వేరే వాళ్లకు ఇవ్వాలని ఏపీ బీజేపీ ఎమ్మెల్యే లు కూడా డిమాండ్ చేస్తున్నారట. పురందరేశ్వరికి కాకుండా ఇంకా ఎవరికి ఇచ్చినా... తాము పని చేస్తామని స్పష్టం చేస్తున్నారట. అయితే... పురందరేశ్వరి మాత్రం అందరినీ కలుపుకు వెళ్తానని చెబుతున్నారు. తెలుగు దేశం పార్టీ మూలాలు పురందరేశ్వరి లో ఉన్న తరుణంలో.. ఆమెను అస్సలు  అధ్యక్ష పదవికి తీసుకోకూడదని కోరుతున్నారట. అంతేకాదు... ఈ బీజేపీ పార్టీ ఎమ్మెల్యేల తిరుగు బాటు వెనుక...సోము వీర్రాజు ఉన్నారని చెబుతున్నారు. ఆయనే పురంధేశ్వరికి వ్యతిరేకంగా పోరాటం చేయిస్తున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: