- సీఎం రేవంత్ రెడ్డి కెరియర్ లోనే మాయని మచ్చ.!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టారో అప్పటినుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటూ వచ్చింది. చివరికి అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి ఎంతో కష్టపడ్డారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ కు సవాల్ విసిరాడు. నేను సీఎం అయిన తర్వాతే ఏదైనా మాట్లాడతానని అన్నాడు. ఆయన సీఎం అనే పదాన్ని ఎప్పుడైతే నోట్లో నుంచి పలికారో అదే దిశలో ప్లాన్ ప్రకారం వెళ్లి చివరికి తెలంగాణ రాష్ట్ర మూడవ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అలా తాను చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ ముందుకు వెళుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఎన్నో మంచి పనులు చేశారు. ఆయన రాజకీయ జీవితంలో ఒకే ఒక మాయని మచ్చ ఉంది.. అదే ఓటుకు నోటు కేసు. ఈ ఒక్కటి తప్ప ఆయన జీవితాన్ని నిందించడానికి ఎలాంటి విషయాలు కూడా లేవు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.
ఓటుకు నోటు:
సరిగ్గా తొమ్మిది సంవత్సరాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది ఓటుకు నోటు కేసు. ఓటుకు నోటు కేసు అనేది 2015 మే లో జరిగింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థికి ఓటు వేయడం కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ వాళ్లు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఏసిబి విడుదల చేసింది. ఈ వీడియోలో ఒక బ్యాగులోని నోట్ల కట్టలతో స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు చంద్రబాబు స్టీఫెన్ సన్ తో మాట్లాడిన ఒక ఆడియో కూడా బయటకు వచ్చింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా రేవంత్ రెడ్డిని పోలీసుల అరెస్టు చేశారు. పది రోజులు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రేవంత్ రెడ్డి బెయిల్ పై బయటకు వచ్చారు.