•నివార్ తుఫాన్.. రైతులకు అండగా పవన్..

•ప్రభుత్వంపై ఒత్తిడి.. ప్రజలలో సానుభూతి

•అదే పవన్ రాజకీయ కెరియర్ కు టర్నింగ్ పాయింట్..


(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు, ఆ పార్టీలో కీలకంగా పనిచేశారు. కానీ కొన్ని కారణాల వల్ల చిరంజీవి ఆ పార్టీని 2011లో కాంగ్రెస్లో విలీనం చేయడంతో అక్కడి నుంచి బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత కొంతకాలానికి జనసేన పార్టీని స్థాపించారు. ఇక ఈ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా ఆ సమయంలో ప్రభుత్వాలు చేసే పనులను ఎండగడుతూ ప్రజలకు అండగా ముఖ్యంగా రైతుల ఆత్మహత్యలను తగ్గించే క్రమంలో ఎన్నో ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే నాడు పవన్ కళ్యాణ్ చేసిన రైతు ధర్నా ఆయన రాజకీయ భవిష్యత్తుని మార్చేసిందని చెప్పవచ్చు.


2019లో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో ఈయన ధర్నా మొదలుపెట్టారు. ఒకవైపు సినిమా షూటింగ్లలో పాల్గొంటూనే ,మరొకవైపు రాజకీయంగా కూడా యాక్టివ్ గా ఉంటూ పార్టీ శ్రేణులలో ఉత్సాహం నింపారు. ఆ సమయంలో తమ మిత్రపక్షమైన బీజేపీతో సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తూ సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరిలో ఆసక్తి పెంచేశారు. అయితే అదే సమయంలో నివార్ తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలి అంటూ కొన్ని జిల్లాలలో పర్యటించిన పవన్ కళ్యాణ్ , పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు గుర్తించా అందులో భాగంగానే అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నా చేయాలని నిర్ణయించుకుని జనసేన నాయకుల చేత ధర్నా చేయించారు అంతేకాదు కలెక్టర్లకు వినతి పత్రాలు కూడా ఇచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు.

ముఖ్యంగా కృష్ణా జిల్లా కలెక్టరేట్ నుంచి మచిలీపట్నంలో నిర్వహించే ధర్నా కార్యక్రమంలో స్వయంగా పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.. నివార్ తుఫాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని ఒక్కో రైతు కుటుంబానికి 30 వేల రూపాయలు పరిహారం ఇస్తేనే ధైర్యంగా ఉంటారని డిమాండ్ కూడా చేశారు. ఇక ప్రజల నుండి కూడా పెద్ద ఎత్తున స్పందన లభించింది. నాడు రైతుల కోసం ఆయన ఆ రేంజ్ లో ధర్నాలు చేశారు. కాబట్టి 2024 ఎన్నికలలో 100% స్ట్రైక్ సక్సెస్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: