ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసిపి అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కూడా హోం శాఖలో సంచలన మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె చేసిన ఒక ప్రకటన ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి షాక్ అనే చెప్పాలి.ప్రజలు తిరస్కరించినా జగన్‌ తీరులో మార్పు రాలేదని హోం మంత్రి వంగలపూడి అనిత విమర్శించారు.ఇప్పటికీ తన పార్టీ రాజ్యాంగంలో రాసుకున్న ఫేక్‌ రాజకీయాన్నే జగన్‌ నమ్ముకున్నారన్నారు.ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే గా ఉన్న జగన్‌కు నిబంధనల ప్రకారం జెడ్‌ ప్లస్‌ కేటగిరీ, ఆయన సతీమణి భారతీ రెడ్డికి 2+2 భద్రత ఇచ్చామన్నారు. ప్రతిపక్ష హోదా లేకున్నా ఇవన్నీ కల్పిస్తున్నామని తెలిపారు.6ttఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలన్న మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడాన్ని జీర్ణించుకోలేకే వైఎస్ జగన్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ శవరాజకీయాలు చేస్తున్నారన్న వంగలపూడి అనిత.. అకారణంగా ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏపీలో కేవలం నాలుగు రాజకీయ హత్యలు మాత్రమే జరిగాయన్న అనిత.. వీటిలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలే చనిపోయారని వెల్లడించారు.

వైఎస్ జగన్ మాత్రం 36 రాజకీయ హత్యలు జరిగాయంటున్నారని.. అదే నిజమైతే ఆయా హత్యల వివరాలు ప్రభుత్వానికి ఇవ్వాలన్నారు. వివరాలు ఇవ్వలేకపోతే ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నించారు. వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి కావునే ఆయనకు ఆ రేంజులో భద్రత కేటాయిస్తున్నామని వంగలపూడి అనిత చెప్పారు.ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి ఉన్న సమయంలో 980 మంది పోలీసు సిబ్బందితో భారీ భద్రత ఏర్పాటు చేసుకున్నారని, దీని కోసం ప్రభుత్వానికి నెలకు రూ.6 కోట్లు ఖర్చయ్యేదని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు.ఇది చాలదన్నట్లుగా కొంతమంది ప్రైవేటు వ్యక్తుల్ని భద్రత కోసం నియమించుకున్నారని, వారికి ప్రభుత్వ ఖజానా నుంచి నెలకు రూ.53 లక్షల చొప్పున చెల్లించేవారని తెలిపారు. అధికార దర్పం, అధికార పిచ్చితో ప్రజల సొమ్మును ఆయన ఇలా దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్‌కు నిబంధనల ప్రకారం జడ్‌ ప్లస్‌ భద్రత, ఆయన తల్లి విజయమ్మ, భార్య భారతికి 2 ప్లస్‌ 2 సెక్యూరిటీ ఇస్తున్నామని అన్నారు.జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విజయమ్మకు 1 ప్లస్‌ 1 భద్రత మాత్రమే ఉందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణికి అసలు ఎలాంటి భద్రతనూ జగన్‌ కల్పించలేదని గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: