తమిళ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విజయ్ నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ సినిమా వచ్చిందంటే చాలు ప్రతి ఒక్క సినీ ప్రేక్షకులు విజయ్ సినిమాను తప్పకుండా వీక్షిస్తారు. విజయ్ తమిళంతో పాటు తెలుగులో కూడా ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఓవైపు హీరోగా రాణిస్తూనే మరోవైపు రాజకీయ అరంగేట్రం చేశారు.


తన పార్టీ "తమిళగ వెట్రి కళగం" జెండా గుర్తును హీరో విజయ్ విడుదల చేయడం జరిగింది. చెన్నైలోని పనయుర్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో "తమిళగ వెట్రి కళగం" పార్టీ జెండాను ఆవిష్కరించారు. కాగా, ఇటీవల విజయ్ "తమిళగ వెట్రి కళగం" పార్టీని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమానికి విజయ్ తల్లిదండ్రులతో పాటు మద్దతుదారులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

పనయుర్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 9 గంటలకు పార్టీ జెండాను విజయ్ ఆవిష్కరించారు. పార్టీ జెండాను పరిశీలిస్తే ఎరుపు, పసుపు రంగు, ఏనుగులతో జెండా ఉంది. అనంతరం పార్టీ సిద్ధాంతాలను ప్రకటించారు. కులం, మతం, ప్రాంతం, లింగ బేధాలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే తమ పార్టీ లక్ష్యమని విజయ్ తెలియజేశారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన విజయ్ ఈ మేరకు వేగంగా అడుగులు వేస్తున్నారు.


ఇందులో భాగంగానే పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి 300 మంది పార్టీ కార్యకర్తలు పాల్గొనడం విశేషం. అయితే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఆయన సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉండగా.... విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ "గోట్" . ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా కోసం విజయ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: