- బొత్స కు విజ‌య‌న‌గ‌రం , విశాఖ జిల్లా ల స‌మ‌న్వ‌య బాధ్య‌త‌లు

- ( ఉత్త‌రాంధ్ర - ఇండియా హెరాల్డ్ ) .

వైసిపి సీనియర్ నేత తాజా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కు అనూహ్యంగా ల‌క్‌ కలిసి వచ్చింది. మొదటి ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు ఆయన మంత్రిగా కొనసాగారు. పైగా ఎన్నికలలో ఏ కుటుంబానికి దక్కని విధంగా బొత్స‌ కుటుంబానికి ఏకంగా ఐదు టిక్కెట్లు దక్కాయి. బొత్స చీపురుపల్లి నుంచి - ఆయన మేనకోడలు భర్త బ‌డ్డుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల నుంచి ... బొత్స సోదరుడు బొత్స అప్పల నరసయ్య గజపతినగరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. బొత్స సమీప బంధువు బెల్లాన చంద్రశేఖర్ విజయనగరం నుంచి ఎంపీగా పోటీ చేస్తే ... బొత్స భార్య ఝాన్సీ లక్ష్మి విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేశారు అయితే కూటమి ప్రభుత్వం గాలిలో అందరూ కట్టకట్టుకుని మరీ ఓడిపోయారు. అయితే అనూహ్యంగా విశాఖ స్థానిక సంస్థల స్థానానికి జరిగిన ఉప ఎన్నికలలో బొత్స వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఏకగ్రీవంగా విజయం సాధించారు.


జగన్ తనపై పెట్టిన నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా విజయం సాధించిన బొత్సపై ఇప్పుడు జగన్ రెండు పెద్ద బాధ్యతలు పెడుతున్నట్టు తెలుస్తోంది. బొత్స సొంత జిల్లా విజయనగరం తో పాటు ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్న విశాఖపట్నం ఉమ్మడి జిల్లాల పార్టీ బాధ్యతలను ఆయనకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు ఉమ్మడి జిల్లాలలో పార్టీ నాయకులను సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుంచి నడిపించాల్సిన పెద్ద బాధ్యతను ఇప్పుడు జగన్ బొత్సపై పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇక బొత్స‌ కూడా కొద్ది రోజులుగా విజయనగరంతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లా పై పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు .. ఇది నిజంగా ఆయనకు మంచి అవకాశం లాంటిది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: