కొంతమంది ఆడవాళ్లు తమ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన చట్టాలను దుర్వినియోగం చేస్తుంటారు. ఇటీవల ఓ మహిళ కూడా అదే పని చేసింది. తన భర్తను కోర్టుకు ఈడ్చి, నెలకు 6 లక్షల రూపాయలు మెయింటెనెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ డబ్బుతో తాను బ్రాండెడ్ బట్టలు కొనుక్కోవడానికి, ఖరీదైన హోటళ్లలో భోజనం చేయడానికి, ఇంకా తన వ్యక్తిగత ఖర్చుల కోసం వాడుకుంటానని చెప్పింది. భార్య లేదా భర్త ఎవరైనా, విడాకుల కేసు నడుస్తున్నప్పుడు కోర్టును ఆశ్రయించి, తమ జీవన ఖర్చుల కోసం డబ్బు ఇవ్వమని అడగవచ్చు. ఇది హిందూ వివాహ చట్టం ప్రకారం ఉంది. కానీ ప్రస్తుత కేసులో ఆ మహిళ అడిగిన డబ్బు మొత్తం చాలా ఎక్కువ. ఆ రేంజ్ లో ఎవరూ కూడా ఖర్చు పెట్టారు అని చాలామంది అనుమానిస్తున్నారు. ఈ కేసు వల్ల, చట్టాన్ని తప్పుగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చాలామంది అనుకుంటున్నారు. అంటే భర్తను బెదిరించడానికి ఈ మహిళ ఇలా చేస్తున్నారేమో అని అనుమానిస్తున్నారు.

ఆ మహిళను ఉద్దేశించి, "ఒకే ఒక్క వ్యక్తికి నెలకు ఇంత డబ్బు అవసరం అవుతుందా? మీరు ఇంత డబ్బు ఖర్చు చేయాలంటే, మీరే సంపాదించుకోండి. మీ భర్త మీద ఆధారపడకండి. మీకు ఇంట్లో బాధ్యతలు లేవు, పిల్లలను చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ డబ్బు మీ వ్యక్తిగత కోరికల కోసమే అని అర్థమవుతుంది. భార్య భర్త మధ్య వివాదం వస్తే, భర్తను శిక్షించడానికి ఇలా చేయడం సరైనది కాదు. మీరు కొంచెం లాజికల్ గా ఆలోచించండి" అని కోర్టు జడ్జి ఆమెకు చివాట్లు పెట్టారు.

 అంతేకాదు  కోర్టు "మీరు ఏయే ఖర్చుల కోసం ఈ డబ్బు అడుగుతున్నారో, దానికి సంబంధించిన బిల్లులు లేదా రశీదులు చూపించండి" అని అడిగింది. దానికి ఆమె సమాధానం చెబుతూ  నెలకు 50 వేల రూపాయలు గడియారాలు, చెప్పులు, ఇంకా ఇతర అలంకార వస్తువులు కొంటానని పేర్కొంది. నెలకు 4 లక్షల రూపాయలు కాస్మెటిక్స్ వైద్య ఖర్చుల కోసం అవసరమని చెప్పింది.

ఆ మహిళ పిల్లల సంక్షేమం గురించి ఏమీ చెప్పలేదు. తన వ్యక్తిగత ఖర్చుల కోసమే ఈ డబ్బు అవసరం అని నిర్భయంగా పేర్కొంది. అయితే ఇలాంటి వివాదాలు కోర్టుల్లో పెరుగుతున్నాయి. భార్యలు భర్తల నుంచి ఎక్కువ డబ్బు ఇవ్వమని అడుగుతున్నారు.
చట్టం భార్యలను రక్షించడానికి ఉంది. కానీ కొంతమంది భార్యలు ఈ చట్టాన్ని తప్పుగా ఉపయోగించుకుంటున్నారని కొందరు అంటున్నారు. ఆమె కేసు సంచలనంగా మారింది. కోర్టు ఆమె చెప్పిన కారణాలకు కన్విన్స్ కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: