ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం... కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో... 164 స్థానాలు దక్కించుకున్న తెలుగుదేశం కూటమి అధికారంలోకి... రావడం జరిగింది. అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగా..డిప్యూటీ ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఛాన్స్ ఇచ్చారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కు దాదాపు నాలుగు మంత్రిత్వ శాఖలు కూడా దక్కాయి.


ఏపీలో తెలుగుదేశం కూటమి విజయానికి జనసేన ఎంతో కృషి చేసింది. మూడు పార్టీలను కలపడంలో పవన్ కళ్యాణ్ చాలా కష్టపడ్డారు. అందుకే ఏపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కు కీలక పాత్ర దక్కుతోంది. అయితే ఇప్పుడు..  ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ జరగబోతుంది. ఈ తరుణంలో 23 వేల దరఖాస్తులు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చాయట. ఇంకా కూడా ఈ.. ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.


అయితే తెలుగుదేశం నుంచి ఎన్ని దరఖాస్తులు వచ్చినా... జనసేన కోట దాదాపు 30% ఉండే ఛాన్స్ ఉంది. ఇందులో కీలక నేతలకు పదవులు ఇచ్చేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగం సిద్ధం చేస్తున్నారట. ముఖ్యంగా 10 సంవత్సరాల కాలంలో జనసేన కోసం పనిచేసిన వారికి... ఈ నామినేటెడ్ పదవులు దక్కేలా చూసుకుంటున్నారట.  అయితే.. ఎన్నికల కంటే ముందు...  జనసేనలో చేరిన పృధ్వి రాజుకు కూడా... ఓ పదవి వస్తుందని సమాచారం.


గతంలో వైసిపి పార్టీలో 30 ఇయర్స్ పృథ్వి... ఎన్నికల కంటే ముందు జనసేనలో చేరారు. ఏపీలో పవన్ కళ్యాణ్ విషయం కోసం చాలా కష్టపడ్డారు.  అయితే తాజాగా ఓ సినిమా వేడుకలో పృద్వి మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ తన కోసం ఓ గిఫ్ట్ రెడీ చేశాడని ప్రకటించారు. చిరంజీవి బర్త్డేలో భాగంగా.. ఆ గిఫ్ట్ తనకు రాబోతుందని వెల్లడించారు. దీంతో పృథ్వి కి నామినేటెడ్ పదవి రాబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: