వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి - వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నెల్లూరు జిల్లాలో రాజకీయంగా గత పది సంవత్సరాలలో ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. వారు చేసిన అనేక సేవా కార్యక్రమాలు ఈ దంపతులకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. వైసీపీలో రాజ్యసభ సభ్యుడుగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ యేడాది జరిగిన ఎన్నికలలో వైసిపి నుంచి నెల్లూరు పార్లమెంటు స్థానానికి అభ్యర్థిగా ఖరారు అయ్యారు. అయితే జగన్ తీరుతో విసిగిపోయిన ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పి ఎన్నికలకు ముందు పసుపు కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు ఎంపీ టికెట్ ... ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతి రెడ్డికి కొవ్వూరు అసెంబ్లీ టికెట్ చంద్రబాబు ఇచ్చారు.. ఎన్నికలలో ఇద్దరు ఘనవిజయం సాధించారు.


వాస్తవంగా చూస్తే వేమిరెడ్డి దంపతులు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి నిస్తేజంగా ఉన్న పార్టీకి మంచి ఊపు ఇవ్వడంతో పాటు ఇద్దరు ఒకరు ఎంపీగా మరొకరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రశాంతి రెడ్డికి కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అందరూ అనుకున్నారు. అయితే నెల్లూరు జిల్లాలో ఉన్న సమీకరణాల నేపథ్యంలో ప్రశాంత్ రెడ్డికి మంత్రి పదవి రాలేదు. ఇక ఇప్పుడు ఆమెకు ఓ కీలక పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పదవుల విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా టీటీడీ చైర్మన్ .. బోర్డు సభ్యులపై చంద్రబాబు కసరత్తులు చేస్తున్నారు.


టీటీడీ బోర్డు చైర్మన్ ఎవరనే విషయమై పలువురు పేర్లు తెరమీదకు వచ్చాయి. ఇక బోర్డు సభ్యుల విషయానికి వస్తే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేరు దాదాపు ఖరారు అయినట్టు తెలుస్తుంది. ఆమె గతంలో జగన్ ప్రభుత్వ హయంలో కూడా టీటీడీ సభ్యురాలుగా పనిచేశారు. అలాగే టిటిడి ఢిల్లీ సలహా మండలి చైర్పర్సన్ గా కూడా పనిచేశారు. నెల్లూరు జిల్లా రాజకీయాలలో వేమిరెడ్డి దంపతులు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అటు చంద్రబాబు కోసం తమ వంతుగా ఎన్నికైన పోరాటాలు చేసి మరి పార్టీని నిలబెట్టారు. అందుకే ప్రశాంతి రెడ్డికి టీటీడీ బోర్డులో స్థానం ఖరారు అయిందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: