- హైడ్రాపై దానం కామెంట్లు.. రేవంత్ కు పిచ్చ కోపం

- ( గ్రేట‌ర్ హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) .

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తున్నాయి . ఇటీవల దానం నాగేంద్ర వ్యవహార శైలిపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం గా ఉన్నట్టు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. వాస్తవానికి గత ఏడాది జరిగిన ఎన్నికల లో తానం నాగేందర్ బి.ఆర్.ఎస్ పార్టీ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుని పార్లమెంటు ఎన్నికలలో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ మారినప్పుడు దానం నాగేందర్ మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు అంటూ ప్రచారం జరిగింది.


తాజాగా హైదరాబాద్లో ఆక్రమణలు అడ్డుకట్ట వేయటానికి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా హైడ్రా తీసుకువచ్చింది. అయితే దీనిపై దానం చేసిన కామెంట్లు పట్ల రేవంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అధికార పార్టీలో ఉండి ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడం ఏంటని ? సీఎం దానం నాగేందర్ ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని కూడా గట్టిగా వారిని ఇచ్చినట్టు సమాచారం. రేవంత్ క్లాస్ తీసుకోవడంతో దానం నాగేంద‌ర్ కాస్త వెనక్కి తగ్గారని అంటున్నారు.


హైడ్రా మంచి పని చేస్తుందంటూ దానం స్టేట్మెంట్ ఇచ్చారు.. అయినా సీఎం కు దానం పై ఇంకా కోపం చల్లారలేదని అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో మాజీమంత్రి సీనియర్ నేతగా ఉన్న దానం ను పార్టీలోకి తీసుకుంటే పనికి వస్తాడు అనుకుంటే ... ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరించడం రేవంత్‌కు ఎంత మాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: