తెలుగు రాష్ట్రాలలో వైసిపి - బిఆర్ఎస్ పార్టీలది ఒకే విధమైన స్టోరీ అని చెప్పాలి. అధికార పార్టీలుగా గత ఐదేళ్లపాటు ఒక వెలుగు వెలిగి అనూహ్యంగా ప్రతిపక్షపాత్రలోకి జారుకున్నాయి. బీఆర్ఎస్ కంటే కూడా వైసిపి ఆంధ్రప్రదేశ్లో ఘోర ప‌రాజ‌యం చ‌విచూసింది.. దీంతో ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరు వైసిపికి గుడ్ బై చెబుతున్నారు. మరికొందరు రాజకీయ సన్యాసం చేస్తున్నారు. బిఆర్ఎస్ లోనూ ఇంచుమించు ఇలాంటి పరిస్థితి నెలకొన్నా ఆ పార్టీ ఆ ఓట‌మి నుంచి పాటలు నేర్చుకోవాలని గట్టిగా కష్టపడుతోంది. అయితే వైసిపి లో మాత్రం అలాంటి ప్రయత్నాలు లేకపోవడం ఆ పార్టీ కేడర్ను ... నాయకులను తీవ్ర నిరాశ‌కు గురిచేస్తుంది.


బిఆర్ఎస్ మళ్లీ పుంజుకుంటుందని ఆ పార్టీ కీలక నేత కేటీఆర్ పదే పదే చెబుతున్నారు. సిద్ధాంతపరమైన విమర్శలు .. పోరాటాలతో ప్రజల్లో క్రేజ్ తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా కొందరు నేతలు కారు దిగుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో మాత్రం పరిస్థితి ఘోరంగా ఉంది. ఆ పార్టీ కేడర్ మాత్రం నిద్రా వస్తలో ఉంది. పార్టీ ఓడిపోవడం ఒక ఎత్తు అయితే ... చిత్తుచిత్తుగా ఓడిపోయి కేవలం 11 సీట్లకే పరిమితం అయింది. దీనికి తోడు జగన్ నిరంకుశ .. నియంత్రత్వ విధానాలకు విసుగు పోయిన వైసిపి నాయకులు ఒక్కొక్కరు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.


పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన నేతలు జగన్ అండదండలు చూసి రెచ్చిపోయిన నేతలు కూడా ఇప్పుడు వైసీపీలో ఉండేందుకు ... జగన్తో కలిసి రాజకీయం చేసేందుకు ఎంత మాత్రం ఇష్టపడటం లేదు... అంటే వారు జగన్ పనితీరు పట్ల జగన్ విధానాల పట్ల ఎంతగా విసిగిపోయి ఉన్నారో తెలుస్తోంది. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ నాయకులకు అండగా నిలబడాల్సిన జగన్ పదేపదే బెంగుళూరు వెళ్లిపోతుండటం కూడా వారిని నిరాశకు గురిచేస్తుంది. ఏది ఏమైనా జగన్కు సైతం పార్టీ పుంజుకుంటుందన్న ఆశలు లేవని వైసిపి వాళ్ళే గుసగుసలాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: