మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా రాష్ట్రంలో లేవంటూ జగన్ తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రిలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ అని ఆయన చెప్పుకొచ్చారు.
 
ఎస్పీకి సమాచారం ఇచ్చి వెళ్లినా టీడీపీ మూకలు అడ్డుకున్నాయని ఆయన పేర్కొన్నారు. వైయస్సార్‌సీపీ నాయకుడి ఇంటిని తగలబెట్టాయని వాహనాలను ధ్వంసం చేశాయని ఆయన తెలిపారు. కిందిస్థాయిలో ఇన్ని దారుణాలు జరుగుతున్నాయని జగన్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా నేరం చేయాలంటేనే భయపడాలంటూ పైన ఉన్న చంద్రబాబు కబుర్లు చెబుతున్నారని జగన్ పేర్కొన్నారు.
 
ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏముంటుంది? అంటూ ఆయన చేసిన కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. తప్పు చేస్తే శిక్ష ఖాయమనే సందేశాన్ని నేరగాళ్లకు పంపాలని బాబు ఒక సమావేశంలో చెప్పడంతో జగన్ ఈ కామెంట్లు చేశారు. జగన్ కామెంట్లకు కూటమి నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది. కూటమి పాలనపై తరచూ విమర్శలు చేస్తూ జగన్ వార్తల్లో నిలుస్తున్నారు.
 
జగన్ భద్రతా సిబ్బందికి నెలకు 6 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని వంగలపూడి అనిత కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అభిమానులకు, కార్యకర్తలకు సైతం జగన్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ మరింత మారాల్సిన అవసరం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ రాబోయే రోజుల్లో పొలిటికల్ కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. జగన్ రాజకీయాల్లో మరింత సక్సెస్ కావాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. జగన్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండనుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: