తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గత కొంతకాలంగా పొలిటికల్ కార్యక్రమాలకు ఒకింత దూరంగానే ఉన్నారనే సంగతి తెలిసిందే. కేసీఆర్ ప్రజల్లోకి వస్తే బాగుంటుందని బీఆర్ఎస్ అభిమానులు కోరుకుంటుండగా త్వరలో రైతు యాత్రతో కేసీఆర్ ప్రజల ముందుకు రానున్నారని సమాచారం అందుతోంది. మాజీ మంత్రి హరీష్ రావు ఆలేరులో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది.
 
కేసీఆర్ ఈ ఏడాది ఫిబ్రవరి నెల నుంచి తెలంగాణ భవన్ కు వస్తారని ప్రచారం జరిగినా ఆ ప్రచారం నిజం కాలేదనే సంగతి తెలిసిందే. ప్రతి రైతుకు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా కాంగ్రెస్ అడుగులు పడనున్నాయని కాంగ్రెస్ ప్రకటించినా ఇప్పటికీ తమకు పథకాలు అమలు కాలేదని చాలామంది రైతులు చెబుతున్నారు. కేసీఆర్ యాక్టివ్ అయితే మాత్రమే పార్టీలో పరిస్థితి మారే ఛాన్స్ అయితే ఉంటుంది.
 
రైతు యాత్ర బీ.ఆర్.ఎస్ పార్టీకి ఎంత మేర ప్లస్ అవుతుందో చూడాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మినహా మిగతా ఏ పార్టీకి ప్రజల్లో ఆశించిన స్థాయిలో గుర్తింపు లేదనే సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి ధీటైన పార్టీగా రాష్ట్రంలో ఏ పార్టీ ఎదుగుతుందనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ప్రణాళికలు ఎలా ఉండనున్నాయో చూడాలి.
 
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన బాగానే ఉన్నా మరీ అద్భుతంగా అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ అమలు ద్వారా రైతులను మాత్రం ఊహించని స్థాయిలో మెప్పించిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ఫ్రీ బస్ స్కీమ్ పై మాత్రం మహిళల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న స్కీమ్స్ కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు.
.


మరింత సమాచారం తెలుసుకోండి: