తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ చాలా సైలెంట్ అయ్యారు. కనీసం, ప్రతిపక్షాలను కూడా విమర్శించడం లేదు. ఇదే తరుణంలో కేసీఆర్ అంతగా భరోసా ఇవ్వకపోవడంతో బిఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది  నేతలు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీని ఆశ్రయిస్తున్నారు. కొంతమంది బిజెపి వైపు చూస్తున్నారు.  ఈ విధంగా పెద్ద నేతలే పార్టీలో ఉండకుంటే కార్యకర్తల పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఎటు తోచని స్థితిలో నిస్సహాయులయ్యారు. కనీసం కార్యకర్తలకు భరోసా ఇచ్చే నాయకుడు లేకుండా ఉన్నారు.  అలాంటి ఈ తరుణంలో కార్యకర్తల్లో, రైతుల్లో ఉత్సాహం నింపేందుకు  రైతు బాంధవుడు కేసీఆర్ మరోసారి ప్రజల్లోకి రాబోతున్నారట. ఆ వివరాలు ఏంటో చూద్దాం. 

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు, నెరవేరడం లేదని, రుణమాఫీ పేరుతో ప్రభుత్వం మోసం చేస్తుందని కొంతకాలంగా బీఆర్ఎస్  ప్రశ్నిస్తోంది. అంతే కాకుండా హరీష్ రావు కేటీఆర్ కూడా పోటీపై సవాళ్లు విసురుతూ  యాత్రలు చేస్తున్నారు. ఇలా వీరిద్దరే పోరాడుతుంటే ప్రతిపక్ష నేత కేసిఆర్ మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు. ఎంపీ ఎన్నికల్లో గోర ఓటమి తర్వాత కేసీఆర్ కనీసం బయట కనిపించడం లేదు.  బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో అసెంబ్లీకి వచ్చి బడ్జెట్ పై తన అభిప్రాయాన్ని మీడియా ముందు తెలియజేసి మళ్లీ వెళ్ళిపోయారు.

దీంతో కేసీఆర్ సైలెంట్ అయిపోయారని, కేసీఆర్ త్వరలోనే రైతు యాత్ర చేయబోతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆలేరులో తెలియజేశారు. ప్రతి ఒక్క రైతుకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం ఒత్తిడి తెచ్చేలా ఈ యాత్ర ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన తేదీలు వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఒకవేళ కేసీఆర్ యాత్ర మొదలు పెడితే మాత్రం  కాంగ్రెస్ కు కాస్త మైనస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. కేసీఆర్ అలాగే ప్రజల్లో తిరుగుతూ ఉంటే  మళ్లీ బీఆర్ఎస్ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: