గత కొద్ది రోజులుగా వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి కూటమి నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు జగన్ ప్రభుత్వం చేసినటువంటి కొన్ని పనుల వల్ల ఖర్చులు లెక్కేసి చెబుతూ పలు రకాలుగా హంగామా సృష్టిస్తున్నారు కూటమి నేతలు. వీటితోపాటు తమ మీడియాతో వీటిని వత్తాసు పలికిస్తూ ఉన్నారట. అయితే ఇప్పుడు తాజాగా ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన మాట్లాడుతూ తన సెక్యూరిటీ గురించి పలు విషయాలను తెలియజేసింది.


జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ కింద 980 మంది పోలీస్ సిబ్బంది భద్రతను ఏర్పరచుకున్నారు అంటూ తెలియజేసింది.. ఇందుకోసం ప్రతి నెల ఏకంగా రూ .6 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయ్యేది అంటూ తెలిపారు. వీరు సరిపోరు అన్నట్లుగా మరి కొంతమంది ప్రైవేటు వ్యక్తులను సైతం భద్రత కోసం ఏర్పాటు చేసుకున్నరు అంటు తెలిపారు. వారి నుంచి ప్రతి నెల ప్రభుత్వ ఖజానాలనుంచి రూ .53 లక్షల రూపాయలు చొప్పున చెల్లించారంటూ ఇటీవల విలేకరులతో మాట్లాడిన హోమ్ మినిస్టర్ తెలియజేశారు.


ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న జగన్ కు రూల్ ప్రకారం జెడ్ ప్లస్ భద్రత అనేది ఉండదని ఆయన తల్లి విజయమ్మ భార్య భారతికి 2+2 సెక్యూరిటీ ఇస్తున్నట్లుగా తెలియజేశారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన తల్లి విజయమ్మకు సైతం వన్ ప్లస్ వన్ భద్రత మాత్రమే ఇచ్చేవారని.. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు కుటుంబ సభ్యులకు మాత్రం ఎలాంటి భద్రతా కలిపించలేదని తెలిపారు. ముఖ్యంగా చంద్రబాబు భార్య భువనేశ్వరి ఆయన కోడలు బ్రాహ్మణి వంటి వారికి ఎలాంటి సెక్యూరిటీ లేదని కూడా తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 36 హత్యలు జరిగాయి అంటూ తెలియజేస్తున్నారు. వాటికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని జగన్ కోరుతూ ఇప్పటివరకు ఎలాంటి సమాధానం తెలుపలేదంటూ ఆమె తెలియజేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: