గత ప్రభుత్వం సర్పంచ్లకు సంబంధించి ఎలాంటి నిధులను విడుదల చేయలేదని అపవాదం కూడా ఉన్నది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 72 రోజుల్లోనే పంచాయతీల అభివృద్ధి కోసం సర్పంచుల ఖాతాలో రూ 988 కోట్ల రూపాయలను జమ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ డబ్బులను సైతం పంచాయతీకి వినియోగించాలి అంటూ పంచాయతీరాజ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్సీ వైబీవి రాజేంద్రప్రసాద్ తెలియజేశారు. నిన్నటి రోజున మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ,నారా లోకేష్ కి సైతం అభినందనలు తెలియజేశారు.


జలజీవన్ కింద ప్రతి ఇంటికి కూడా కొళాయి ఉండాలని ఈ పథకం కోసం మరో రూ .500 కోట్లను అటు ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విడుదల చేశారని తెలిపారు. అలాగే సర్పంచ్ ఎంపీటీసీ జడ్పిటిసి వారి యొక్క గౌరవేతనం కూడా పెంచాలనే నిర్ణయాన్ని తీసుకున్నారని తెలియజేశారు. పంచాయతీ కింద చేసేటువంటి 36 పనులను గ్రామాలలో చేసుకొనేలా ఈ నెల 23 నుంచి గ్రామ సభలను మొదలు పెట్టాలని విధంగా నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. అన్ని గ్రామాలలో  అభివృద్ధి వైపుగా కార్యక్రమాలను చేపట్టాలని కూడా తెలియజేశారు.


ఇందుకు సంబంధించి 2000 కోట్ల రూపాయలు విడుదల చేశారని పంచాయతీలకు ఏపీ సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీలను సైతం నెరవేర్చడం చాలా ఆనందంగా ఉంది అంటూ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తెలియజేశారు. పంచాయతీ నిధులు రూ.10,600 కోట్ల రూపాయలు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పక్కదారి వర్తించారంటూ తెలియజేశారు. గత ప్రభుత్వంలో పంచాయతీ నిధులు దారి మళ్లింపు పైన చాలా ఉద్యమాలు చేపట్టామంటూ తెలియజేశారు రాజేంద్రప్రసాద్. ప్రస్తుతం సర్పంచ్ల ఖాతాలకు సంబంధించి ఈ డబ్బు జమ చేయడంతో సర్పంచ్లకు మళ్ళీ తిరిగి పూర్వ వైభవం కూటమి ప్రభుత్వంతోనే రాబోతోంది అంటూ పలువురు నేతలు కూడా ఆనందాన్ని తెలియజేస్తున్నారు. మరి ఇప్పటికైనా రోడ్లు అభివృద్ధి అయితాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: