• 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన వైఎస్ జగన్ 

• ఆయన ఓటమికి చాలా మందే కారకులు 

జగన్ సతీమణి భారతి కూడా ఒక కారణమే 

(ఏపీ - ఇండియాహెరాల్డ్)

2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ కేవలం 11 సీట్లతో ఘోర పరాజయాన్ని చవి చూసింది. 151 సీట్ల నుంచి 11కు పతనం కావడం వెనుక జగన్ ఒకరే కారణం కాదని, పలువురు కారణం అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఉదాహరణకి రోజా, కొడాలి నాని, అంబటి రాయుడు, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వాళ్లు అసభ్యంగా మాట్లాడటం, తప్పుడు సలహాలు ఇవ్వడం వల్ల జగన్ ఓడిపోయారు అని అంటున్నారు. జగన్ పార్టీకి వీళ్ల వల్లే ఎక్కువ వ్యతిరేకత వచ్చిందని కూడా ఆరోపణలు చేస్తున్నారు. జగన్ వీరిని కంట్రోల్ లో పెట్టడంలో ఫెయిల్ అయ్యారు. అయితే ఓటమికి వీరందరికంటే ముఖ్యమైన, ప్రధానమైన కారణం వైఎస్ భారతి అని కూడా కొందరు భావిస్తున్నారు. 

వైఎస్ భారతి ఫ్యామిలీలో చాలా గొడవలు తీసుకొచ్చారట. 2019 ఎన్నికల సమయంలో షర్మిల బై బై బాబు అంటూ జగన్ కి బాగా అండగా నిలిచారు. అయితే ఈసారి జగన్ కి రివర్స్ అయ్యారు. సొంత చెల్లికే న్యాయం చేయలేనివాడు ఇక ఆంధ్ర రాష్ట్రంలోని మహిళలకు ఏం చేస్తారు? అనే ఒక మాటను టీడీపీ పదేపదే వాడుకుంది. షర్మిల పక్కలో బల్లెం లాగా తయారై ఆయన ఓటమిని శాసించింది. అయితే షర్మిల ఎదురు తిరగడానికి కారణం భారతినే అట.

జగన్‌ని వైఎస్ షర్మిల, విజయమ్మలకు వైఎస్ భారతి దూరం చేశారని చాలామంది మాట్లాడుకుంటున్నారు. సాధారణంగా ప్రతి భార్య తన భర్త, తన పిల్లల గురించి ఎప్పుడూ ఆలోచిస్తుంది. భర్త తనకు అనుగుణంగానే నడుచుకోవాలని, తమ ఫ్యామిలీకి మంచి చేయాలని కోరుకుంటుంది. వైఎస్ భారతి కూడా అలానే థింక్ చేశారట. విజయమ్మ, షర్మిల జగన్‌తో కలిసి ఉంటే తన మాటనే కదా అని తనకి స్వేచ్ఛ కూడా ఉండదని ఆమె అనుకున్నారట. భార్యాభర్తల మధ్యలో వీళ్లు ఎందుకు అని అనుకుంటూ వారిని చాలా తెలివిగా దూరం చేసిందని అంటున్నారు. 

జగన్‌ మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల విషయంలో కూడా పెద్ద గొడవలు అయ్యాయట. దీంతో జగన్ షర్మిల అడిగినట్లు ఆమెకు ఆస్తులు పంచిపెట్టడానికి సిద్ధమయ్యారట ఈ విషయం తెలిసి వైఎస్ భారతి అగ్గి మీద గుగ్గిలం అయినట్లు చెబుతున్నారు. జగన్ చెల్లి అడిగిన ఆస్తులు చేసి ఉంటే ఆమె ఇప్పుడు ఈయనకు వ్యతిరేకంగా ప్రచారం చేసేవారు కాదు. వైఎస్ భారతి మాట విని వెనక్కి తగ్గారు. కానీ చివరికి చెల్లి తల్లి ఇద్దరినీ కూడా తనకు వ్యతిరేకం చేసుకున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: