ఇటీవల కాలంలో వైసీపీ వాళ్ల ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ బయట పడుతున్నాయి. విజయసాయి రెడ్డి శాంతిల మధ్య సంబంధం ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి అందులో నిజం ఎంతో తెలియదు కానీ విజయసాయి రెడ్డి ఇమేజ్ ను ఈ వార్తలు డ్యామేజ్ చేశాయి. నిప్పు లేనిదే పొగ రాదు కదా అని నమ్మే వాళ్ళు సొసైటీలో ఉంటారు కాబట్టి ఇలాంటి ఆరోపణలు రావడం మైనస్సే అని చెప్పుకోవచ్చు. దీని తర్వాత చాలా మరో వైసీపీ వివాహేతర సంబంధం బట్టలు అయింది. సామాజికంగా ఆమోదయోగ్యం కాని సంబంధం పెట్టుకున్నాడు దువ్వాడ శ్రీనివాస్. దువ్వాడ తన స్నేహితురాలు అని చెప్పుకుంటూ దివ్వెల మాధురితో సహజీవనం చేస్తున్నాడట.

 ఈ విషయాన్ని మాధురి తో పాటు, దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి, వారి కుమార్తె మీడియా ముందుకు వచ్చి మరీ చెప్పారు. తమ తండ్రి తమను మోసం చేశాడని ఆరోపిస్తూ అతని ఇంటి వెలుపల నిరసన వ్యక్తం చేశారు. దువ్వాడకు వ్యతిరేకంగా వాణి చేసిన నిరసనలకు దివ్వెల మాధురి ఎగతాళి గా రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్షన్స్ కామెంట్స్ చాలా వైరల్ అయ్యాయి. ఈ పరిస్థితి తెలుగు టీవీ సీరియల్‌లోని డ్రామా లాగా తయారయ్యింది.

 ఈ వ్యవహారం చాలా రోజులుగా మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతోంది. సరిగ్గా ఈ సమయంలో దువ్వాడ శ్రీనివాస్‌పై వేటు వేయాలని వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు. టెక్కలి వైసీపీ ఇంచార్జిగా ఉన్న దువ్వాడను పదవి నుంచి తప్పించారు.  ఈ మేరకు కొన్ని గంటల క్రితమే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వార్త వెలువడిన వెంటనే ఈ క్రమశిక్షణా చర్య జరుగుతుందని చాలామంది ఊహించారు కానీ దువ్వాడని తొలగించడానికి ముందు జగన్ చాలా సమయం తీసుకున్నారు.

టెక్కలిలో వైసీపీ కొత్త ప్రాంతీయ ఇంచార్జిగా దువ్వాడ స్థానంలో పేరాడ తిలక్ నియమితులయ్యారు. వాస్తవానికి, దువ్వాడ వైసీపీకి పెద్దగా ఉపయోగపడలేదు, ఎందుకంటే జగన్ టెక్కలి టికెట్ ఇచ్చిన రెండుసార్లూ ఓడిపోయారు. ఇదిలావుండగా, జగన్ దువ్వాడ పట్ల మెతకగా వ్యవహరించి గత టర్మ్‌లో ఎమ్మెల్సీని కూడా చేశారు. కానీ దువ్వాడ జగన్ నమ్మకాన్ని ఎప్పుడూ వొమ్ము చేస్తూనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: