•అది విశ్వాసమే జగన్ ఓటమికి కారణం..

•జగన్ ఓటమికి రోజా కూడా కారణమా.

•మాట దురుసే ప్రజలలో వ్యతిరేకత.


(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్)

అతివిశ్వాసం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని దారుణంగా ఓటమి పాలు చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా తన అనుచరులే తనను నిండా ముంచేశారు అనడానికి చక్కటి నిదర్శనం ఈసారి ఆయన ఓడిపోవడం. ముఖ్యంగా 175 సీట్లలో పోటీ చేస్తే కేవలం 11 సీట్లతో సరిపెట్టుకోవడం ఇంతకంటే దారుణం మరెక్కడ ఉండదు. ముఖ్యంగా చాలామంది నేతలు అధికారంలో ఉన్నప్పుడు పరిపాలన చేయకుండా ప్రతిపక్ష పార్టీలను విమర్శించడమే ప్రధానంగా పెట్టుకున్నారన వార్తలు వినిపించాయి. అంతేకాదు వారు చేసే వ్యాఖ్యలు, వైరల్ అయిన వీడియోలు అన్నీ కూడా ప్రజలు గమనించారు.

జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఆశయాలతో రాజకీయాలలోకి వచ్చారు. అందులో భాగంగానే 2019 ఎన్నికలలో అధికారంలోకి వచ్చి నవరత్నాలు పేరిట సంక్షేమ పథకాలను అమలు చేశారు . అంతేకాదు ఎన్నికలకు ముందు చెప్పని పథకాలను కూడా అమలు చేసి ఎంతో మందికి ఆర్థికంగా అండగా నిలిచారు. అయితే ఆ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలు, కొంతమంది నేతల వల్ల జగన్ పై వ్యతిరేకతను పెంచుకున్నారని చెప్పాలి.

ముఖ్యంగా అలాంటి వారిలో రోజా కూడా ఒకరు.. రోజా ఒకవైపు బుల్లితెర షోలు మరొకవైపు రాజకీయాలంటూ రెండు పడవల మీద ప్రయాణం చేసింది. ఆ తర్వాత మంత్రిగా పదవీ బాధ్యత చేపట్టిన తర్వాత జబర్దస్త్ కు దూరమై తనకు కేటాయించిన శాఖపై పూర్తి ఫోకస్ పెట్టిందని అందరూ అనుకున్నారు. అయితే అదే సమయంలో ఆమె పరిపాలన పక్కన పెట్టి చంద్రబాబు,  పవన్ కళ్యాణ్ అంటూ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టింది . జగన్ చేస్తున్న మంచి పనులు కూడా ఇలాంటి వ్యాఖ్యల వల్ల వెనుక పడిపోయాయి.

చాలావరకు రోజా అసెంబ్లీలో కూడా ప్రతిపక్షాలను విమర్శించే ప్రయత్నం చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు ఆయన ఆశయం ఎటువంటిది , ప్రజల కోసం ఏం చేయాలనుకుంటున్నారు అనే విషయాలను ప్రజలకు చేరవేర్చే ప్రయత్నం చేయలేదు. ముఖ్యంగా ఆమె నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. ఆ ప్రాంతంలో ఈసారి ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది అందుకే ఆమె ఈసారి అక్కడ ఓటమిపాలయ్యింది. ఒకరకంగా చెప్పాలి అంటే ప్రతిపక్షాలను విమర్శించి ప్రజలలో కూడా వ్యతిరేకత పొంది జగన్ను నిండా ముంచేసారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: