-జగన్ నమ్మినబంటుగా సాయిరెడ్డి.
- అదే అదునుగా  భావించి అక్రమాలు
- వైసిపి ఓటమిపై తీవ్ర ప్రభావం.


 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్ల మెజారిటీతో అద్భుతమైన విజయాన్ని సాధించి  ఏపీలో అధికారంలోకి వచ్చింది. ఇదే తరుణంలో జగన్  తన మార్కు పాలనతో ప్రజలకు ఎన్నో పథకాలు తీసుకువచ్చి అందించారు. అలా జగన్ ఐదు సంవత్సరాల పాలనలో  ఆయనకు నమ్మిన బంటుగా ఎంతో మంది నేతలు ఉండేవారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విజయసాయిరెడ్డి. జగన్ తర్వాత నెంబర్ 2 నేతగా రాష్ట్రంలో ఎదిగారు విజయసాయిరెడ్డి. జగన్ కూడా విజయసాయిరెడ్డికే తన పర్సనల్ విషయాలైనా బిజినెస్ విషయాలైనా రాజకీయ విషయాలైనా చెప్పేవారు. ఇక విజయసాయిరెడ్డి చెప్పారు అంటే జగన్ నోట్లో నుంచి వచ్చిన మాటే అనుకోవాలి.  అలా జగన్ కు ఎంతో సన్నిహితుడుగా విజయసాయిరెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో చాలా దగ్గర అయ్యాడు. జగన్ ను అడ్డుపెట్టుకొని ఆయన ఎన్నో అక్రమాలు కూడా చేశారు. ఇదే జగన్ కు కాస్త మైనస్ గా మారుతూ వచ్చింది. విజయసాయిరెడ్డి వల్ల జగన్ కు వచ్చిన నష్టమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 విజయసాయిరెడ్డి జగన్ బంధం:
 విజయసాయి రెడ్డికి జగన్ కుటుంబంతో  రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి  అనుబంధం కొనసాగుతోంది.  ఆయన మరణం తర్వాత తన కొడుకు జగన్ తో ఉండి రాజకీయాల్లో ఎదిగేలా చేశారు. దీంతో విజయసాయిరెడ్డిని జగన్ చాలా నమ్మారు. ఈయనకు ముందుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 2021లో పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. దీని తర్వాత ఆయనను రెండవసారి 2022 మే 15న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ప్రకటించింది. అలా విజయసాయిరెడ్డి  పార్టీకి సంబంధించిన ఎలాంటి వ్యవహారాలైనా చూసుకునేవారు. ముఖ్యంగా ఢిల్లీ పెద్దలతో ఏది చర్చించాలన్న విజయసాయిరెడ్డి ఉండాల్సిందే.  పార్టీకి సంబంధించిన ప్రతి వ్యవహారాన్ని ఢిల్లీ ప్రజలతో మాట్లాడి రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో ఫండ్స్ తీసుకొచ్చారు. అలా జగన్ దగ్గర ఉంటూ  భూకంభకోణాలు వంటివి చేసి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అంతేకాదు  జగను ఎవరు కలవాలన్నా ముందుగా విజయసాయిరెడ్డిని కలవాలి. చాలామంది సాయిరెడ్డి తప్పుల గురించి  జగన్ కు చెప్తారని  ఒక్కోసారి వారికి అపాయింట్మెంట్ కూడా ఇప్పించేవారు కాదు.  దీంతో కిందిస్థాయి నేతలు అందరితో విజయ సాయిరెడ్డికి మధ్య కాస్త దూరము ఏర్పడింది.


దీంతో కింది స్థాయిలో పార్టీ కాస్త బలహీనపడుతూ వచ్చిందని చెప్పవచ్చు. అలా విజయసాయిరెడ్డి చేసిన పనులకు  వైసిపి దారుణంగా ఓడిపోయింది. ఇవాళ విజయసాయిరెడ్డి కాకుండా మరికొంతమంది నేతలు కూడా జగన్ ఓటమిలో కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు. చివరికి ఎన్నికల ముందు జగన్ కు విజయసాయిరెడ్డి గురించి పూర్తిగా అర్థమైంది.  దీంతో ఆయనను దూరం పెడుతూ వచ్చారు. ఈ తరుణంలో విజయసాయిరెడ్డి శాంతి వ్యవహారం బయటకు వచ్చింది. అయితే ఈ క్రమంలోని విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి సంచలన విషయాలు బయట పెట్టారు. సొంత పార్టీ నేతలే కుట్ర చేశారని అన్నారు. ఇక నేను జగన్ మాట వినేదే లేదని, గతంలో జగన్ చెప్పినట్టు వినే నేను న్యూస్ ఛానల్ పెట్టలేదని, జగన్ చెప్పిన మాట అస్సలు విననని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే మాత్రం ఎన్నికలకు ముందు నుంచే జగన్ విజయసాయిరెడ్డి మధ్య కాస్త గ్యాప్ పెరిగింది. విశాఖ ఇన్చార్జిగా ఉన్న విజయసాయిరెడ్డిని అక్కడి నుంచి తప్పించి, నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ఓడిపోతారని తెలిసి కూడా టికెట్ ఇచ్చారట. ఈ విధంగా నెంబర్ 2 నేతగా ఉన్న విజయసాయిరెడ్డి  జగన్ వెంటే ఉంటూ ఎన్నో అక్రమాలు చేయడం వైసిపి పార్టీకి భంగం ఏర్పడింది. దీన్ని గమనించిన జగన్ అప్పటినుంచి ఆయనను దూరం పెడుతూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: