ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ.. ఎవరు ఊహించని ఓటమిని ఎదుర్కొంది. వాస్తవంగా ఏపీలో 70 నుంచి 80 సీట్లు వైసీపీకి కచ్చితంగా వస్తాయని అందరూ అనుకున్నారు. ఏపీలో అధికారంలోకి రాకుండా జగన్మోహన్ రెడ్డి 2014 సంవత్సరంలో... గెలుచుకున్నట్లుగానే... 70కి పైగా సీట్లు వస్తాయని అందరూ అంచనా వేశారు. ఎలక్షన్ల రిజల్ట్స్ వచ్చేసరికి... అందరి అంచనాలు తార్మారు అయ్యాయి.

 

వైసిపి పార్టీ దారుణంగా ఓడిపోవడం జరిగింది. ముఖ్యంగా రాయలసీమలో కూడా... వైసీపీ పార్టీకి ఎవరు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.  జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో కూడా.. షాక్ లే ఎదురయ్యాయి. కడప జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉంటే... అందులో కేవలం మూడు స్థానాలు వైసిపి గెలుచుకోవడం... అత్యంత దారుణం. అయితే ఈ పరిణామాలను గ్రహించిన జగన్ మోహన్ రెడ్డి... పార్టీని మళ్లీ ప్రక్షాళన చేయాలని డిసైడ్ అయ్యారు.


ముందుగా కడప జిల్లాలో.. పార్టీని మళ్లీ ఫ్యామిలీకి తీసుకురావాలని అనుకుంటున్నారు.  ఇందులో భాగంగానే కడప జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి కొత్త వ్యక్తికి ఇచ్చారు జగన్. మాజీ ఎమ్మెల్యే రవీంద్ర రెడ్డి  కి కడప జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. మొన్నటి వరకు ఈ పదవిలో కడప మేయర్ సురేష్ బాబు ఉన్న సంగతి తెలిసిందే.

 

కొత్తగా కడప జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన రవీంద్రనాథ్ రెడ్డి స్వయాన... జగన్మోహన్ రెడ్డికి మేనమామ అవుతారు.  అంటే జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మకు రవీంద్రనాథ్ రెడ్డి తమ్ముడు అన్న సంగతి తెలిసిందే. అయితే రవీంద్రనాథ్ రెడ్డికి కడప పైన మంచి పట్టు ఉంది. 2014 మరియు 2019లో... వైసిపి అభ్యర్థిగా కమలాపురం నుంచి రవీంద్రనాథ్ రెడ్డి విజయం సాధించారు. ఇకాటో కమలాపురం ఇన్చార్జి బాధ్యతలను... జగన్మోహన్ రెడ్డి బామ్మర్ది  నరేన్ రామాంజనేయ రెడ్డికి అప్పగించారు. రవీంద్రనాథ్ కుమారుడే ఈ నరేన్.

మరింత సమాచారం తెలుసుకోండి: