- గన్నవరంలో ఎదురులేదనుకున్నాడు.
- ఎదురొచ్చిన వారిపై దాడులు.
- వంశీ వ్యవహారం వైసీపీకి నష్టం


 రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి  సొంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు.  ఈ తరుణంలో ఆయన దాన్ని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని శతవిధాల ప్రయత్నాలు చేశారు.  కానీ 2014 ఎన్నికల్లో చంద్రబాబు చేతిలో దారుణంగా ఓడిపోయి ఇంటికి పరిమితం అయ్యారు.  ఆ తర్వాత 2019ఎన్నికలపై దృష్టి పెట్టిన జగన్ ఎలాగైనా అధికారంలోకి రావాలని రాష్ట్రమంతా పాదయాత్ర నిర్వహించి మంచి మైలేజ్ తెచ్చుకున్నారు. అలా 2019 ఎన్నికల్లో  జగన్ 151 యొక్క సీట్లతో అద్భుతమైన మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చారు. దీంతో నేతలు జగన్ దగ్గరగా ఉంటూ  దారుణమైనటువంటి విమర్శలు చేస్తూ వచ్చారు.  అంతేకాదు రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తూ టిడిపి నేతలపై దాడులు చేశారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఈయన  వ్యవహారాలు, అరాచకాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

 జగన్ వెంటే ఉంటూ వెన్నుపోటు :
జగన్ ఎంతో నమ్మిన నేతల్లో వల్లభనేని వంశీ కూడా ఒకరు. ఈయన 2014 టిడిపి పార్టీ నుంచి తొలిసారిగా గన్నవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుట్టా రామచంద్రరావుపై 9,548 ఓట్ల మెజారిటీ సాధించారు. రెండవసారి 2019 ఎన్నికల్లో కూడా టిడిపి నుంచి పోటీ చేసి  మరోసారి గెలుపొందారు. ఆ టైంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వంశీ ఆ పార్టీలోకి జంప్ అయ్యాడు. ఎప్పుడైతే వైసీపీలో చేరాడో అప్పటినుంచి జగన్ నమ్మిన బంటుగా ఉంటూ, టిడిపిపై తదేకంగా విమర్శలు చేస్తూ వచ్చారు. ముఖ్యంగా ఎంతో సీనియర్ నేత అయినటువంటి చంద్రబాబును కూడా తిట్టిపోశారు. జగన్ ప్రభుత్వంలో  వల్లభనేని వంశీ అరాచకాలు మామూలుగా ఉండేవి కావు. అక్రమ దందాలు, భూ కబ్జాలు, ఎవరైనా అడిగితే కొట్టడాలు ఇలా ఎన్నో అక్రమ పనులు చేసి ప్రజల్లో మైనస్ అయ్యాడు.  ముఖ్యంగా ఎన్నికలకు ముందు టిడిపి కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ అంతా ధ్వంసం చేశారు ఇందులో వల్లభనేని వంశి ముఖ్యపాత్ర పోషించారని చెప్పవచ్చు. ఈ విధంగా ఆయన అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా, విపక్షాలను విమర్శించడమే  ప్రధాన అస్త్రంగా పెట్టుకుని ముందుకు వెళ్లాడు. దీంతో ప్రజల్లో విపరీతంగా మైనస్ ఏర్పడింది. అయినా జగన్ మళ్ళీ ఆయనకే గన్నవరం టికెట్ ప్రకటించడంతో ఈ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయాడు.

 వల్లభనేని వంశీ వైసీపీకి మైనస్:
 ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సర్వేలను నమ్మి  మళ్లీ పాత వరకే టికెట్లు ఇచ్చారు. తాను అభివృద్ధిని నమ్మి ఉండి , ఇలాంటి అరాచక నాయకులను పక్కనపెట్టి ఉంటే మాత్రం మరోసారి ఆయన అధికారంలోకి వచ్చేవారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  ముఖ్యంగా ఎంతో అభివృద్ధి చేసిన జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోవడానికి ప్రధాన కారణం వంశీ లాంటి నాయకులని చెప్పవచ్చు. కిందిస్థాయి ప్రజలకు జగన్ అంటే ఇష్టం. కానీ ఇలాంటి నాయకులు వారిని భయభ్రాంతులకు గురి చేయడం వల్ల మరోసారి గెలిస్తే మనల్ని బ్రతకనిస్తారా అనే ఆలోచనకు వచ్చి  ప్రజలు ఏకతాటి పైకి వచ్చి   కూటమి నాయకులకు పట్టం కట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: