టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన సమయం నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడంపైనే ప్రధానంగా దృష్టి సారించారు. రాష్ట్రానికి ఆర్థిక సహాయాన్ని కోరేందుకు ఆయన ఇటీవల ప్రపంచ బ్యాంకు, బ్రూక్‌ఫీల్డ్ కార్పొరేషన్, ఇతర ప్రధాన ప్రపంచ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ను ఎకో-ఫ్రెండ్లీ ఎనర్జీ ప్రొడక్షన్ సెంటర్‌గా మార్చేందుకు ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ), ప్రత్యామ్నాయ ఇంధన రంగాల్లోని కంపెనీలతో కూడా చర్చలు జరుపుతున్నారు.

బాబు సంపద సృష్టిలో ఏమాత్రం తగ్గడం లేదు. రూ.2800 కోట్ల పెట్టుబడిపై చర్చించేందుకు ఆయన ఇటీవల గోద్రెజ్ ఇండస్ట్రీస్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఇదొక భారీ అడుగు అని చెప్పవచ్చు. బాబు ఒక ట్వీట్‌లో, "నేను గోద్రెజ్ ఇండస్ట్రీస్ ప్రతినిధి బృందంతో ఒక ప్రొడక్టు మీటింగ్‌ నిర్వహించాను, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ నాదిర్ గోద్రెజ్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. మేము అమరావతి, విశాఖపట్నంలలో పురుగుమందుల తయారీకి రూ.2800 కోట్లతో సహా మరిన్ని పెట్టుబడుల గురించి చర్చించాము." అని తెలిపారు.

అంతే కాదు బాబు గోద్రెజ్‌తో వ్యవసాయం, ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులతో సహా ఇతర అవకాశాలను అన్వేషించారు, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను పెంచే లక్ష్యంతోనే చేస్తున్నారు. గోద్రెజ్ భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన, గౌరవనీయమైన సంస్థ, ఈ పెట్టుబడిని పొందడం ద్వారా వ్యాపారం చేయడానికి సురక్షితమైన ప్రదేశంగా ఆంధ్రప్రదేశ్ కీర్తిని మరింత బలోపేతం చేయవచ్చు.

ఇదిలా ఉంటే, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కూడా యాక్టివ్‌గా ఉన్నారు, ఇటీవల ఫాక్స్‌కాన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తండ్రీకొడుకులు తమ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నట్లు ఈ ఘటనలతో స్పష్టం అవుతుంది. ఒకవేళ ఆయన మాట్లాడే అన్ని చర్చలు సఫలమైతే ఏపీ బాగా డెవలప్ అవుతుంది. నిరుద్యోగులకు సరిపడా ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. దీనివల్ల ఏపీ ప్రజలు వేరే రాష్ట్రాలకి వెళ్లాల్సిన అవసరం కూడా రాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp