నిన్న (ఆగస్టు 22) చిరంజీవి పుట్టిన రోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి విశేషమైన సేవలు అందించాడు. తెలుగు వారందరికీ గర్వకారణంగా నిలిచాడు. పద్మ అవార్డ్స్ కూడా అందుకున్నాడు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు. అందుకే ఆయనకు అందరూ హృదయపూర్వకంగా విషెస్ చెప్పి నిండు నూరేళ్లు బతకాలని కోరుకున్నారు. భారతదేశవ్యాప్తంగా సినీ సెలబ్రిటీల నుంచి మాత్రమే కాకుండా పొలిటిషియన్ల నుంచి కూడా శుభాకాంక్షలు వచ్చాయి.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ అందరూ సోషల్ మీడియా ద్వారా మెగాస్టార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ ప్రత్యేకమైన రోజున మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం చిరంజీవికి శుభాకాంక్షలు చెప్పలేదు. అప్పట్లో ఏపీ సీఎం కార్యాలయంలో (CMO) జగన్‌ను కలవడానికి చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్ ప్రతినిధుల బృందం వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన వివాదాస్పదమైంది. ఆ సమావేశంలో చిరంజీవి చేతులు జోడించి నమస్కరిస్తున్న సమయంలో జగన్ నవ్వుతూ కనిపించారు కానీ తిరిగి నమస్కారం పెట్టలేదు. ఆ విజువల్స్ కి సంబంధించి ఓ వీడియో వైరల్‌గానూ మారింది. చిరంజీవిని జగన్ అగౌరవపరిచారని పలువురు మెగా అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు.

అప్పటి నుండి, మెగా అభిమానులు ఏకమయ్యారు, పవన్ కళ్యాణ్ పార్టీ అయిన జనసేనకు తమ మద్దతును బలపరిచారు. ఇంతకుముందు విడిపోయిన మెగా అభిమానులను ఈ ఘటన ఏకం చేసింది. అంతేకాకుండా చిరంజీవి న్యూట్రల్ గా ఉంటూ చివరికి టీడీపీ, జనసేన కూటమికి పూర్తి మద్దతు ప్రకటించారు. దీనితో జగన్ కంగుతున్నారు. పవన్, చిరు ఒకటేనని ఆయన వారిద్దరిపై కోపం పెంచుకున్నట్లుగా తెలిసింది. వీటన్నిటిని  దృష్టిలో ఉంచుకుని, జగన్ ఉద్దేశపూర్వకంగా చిరంజీవికి శుభాకాంక్షలు తెలుప లేదని అంటున్నారు. జగన్ ట్విట్టర్ ద్వారా ప్రతీ ప్రముఖుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు. జయంతి వర్ధంతి విషెస్ కూడా మిస్ కారు.

కానీ అంతటి చిరంజీవి పుట్టినరోజును మాత్రం ఆయన పట్టించుకోలేదు. చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉపముఖ్యమంత్రి. ఆయనకు అనుకూలమైన టీడీపీ+ కూటమి అధికారంలో ఉంది. అందువల్ల జగన్‌ని కూడా చిరంజీవి గుడ్డు మీద ఈకలా తీసి పారేస్తున్నారు మెగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: