ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికలకు ముందే జనసేన బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి  సీట్లను పంచుకున్నాయి. జనసేనకు 21 ఎమ్మెల్యే సీట్లు కేటాయించగా బీజేపీకి ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు కేటాయించారు. కేటాయించిన స్థానాల్లో చాలామంది టీడీపీ నాయకులు వారి టికెట్టు త్యాగం చేయవలసి వచ్చింది. అలా అలా టిడిపి నాయకులు అండతో గెలిచినటువంటి స్థానాల్లో ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయట.  బిజెపి నుంచి గెలిచిన అభ్యర్థులు ఆ నియోజకవర్గాల్లో టిడిపి నాయకులను అసలు పట్టించుకోవడం లేదట. దీంతో గెలిచి రెండు నెలలైనా కాకముందే  కూటమిలో బిజెపి వర్సెస్ టిడిపి అనే వార్ జరుగుతుంది. కర్నూలు జిల్లా ఆదోని నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన  డాక్టర్ పార్థసారధి ఘనమైన విజయం సాధించారు. 

ఎన్నికలకు ముందు ఆయన టిడిపితో ఎంతో కలిసిపోయి ఉన్నారని గెలిచిన తర్వాత మరో విధంగా ప్రవర్తిస్తున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే తాను ఎమ్మెల్యేగా గెలిచిన అధికారం 10%  అని, మిగతా 90 శాతం కూటమిదే అని పార్థసారథి చెబుతుంటే, తాను గెలిచిన 10 రోజుల నుంచి తన ఒరిజినల్ ఏంటో చూపిస్తున్నారని కూటమి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా  కూటమి నేతలను పిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టిడిపి ఇన్చార్జ్ మీనాక్షి నాయుడు. ఈయన టిడిపిని పట్టుకొని చాలా ఏళ్ల నుంచి ఉంటున్నారు. పార్టీలో ఎంతో పలుకుబడి ఉన్నది.  అయినా పొత్తులో భాగంగా బిజెపికి సీటు వెళ్లడంతో ఆయన సైలెంట్ అయిపోయి పార్థసారథికి సపోర్ట్ చేశారు.

 పార్థసారథి ఎన్నికలకు ముందు ఒకలా ఉన్నారని గెలిచిన బిజెపి ఎమ్మెల్యేగా మాత్రమే వ్యవహరిస్తున్నారని మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని మీనాక్షి నాయుడు బీజేపీ ఎమ్మెల్యే పై విమర్శలు చేశారు. ఎమ్మెల్యే వాస్తవాలు మాట్లాడాలని కానీ ఏది పడితే అది చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని  ఆరోపించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ఏమాత్రం పట్టించుకోవడంలేదని, టిడిపి వాళ్ళు వెళ్తే ఏ పనులు చేయడం లేదని, ఇది ఇలాగే కొనసాగితే ముందు ముందు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆయన చెప్పకనే చెప్పేసారు. దీనిపై కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే పార్థసారథి ఆయన చెప్పిందే నేను వినాలనే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నారని,  బిజెపి, జనసేన పార్టీలో ఎలాంటి వర్గాలు లేవని, ఆదోని టిడిపిలోనే ఐదు వర్గాలు ఉన్నాయని వారంతా కలిసి నాపై విమర్శలు చేస్తున్నారని పార్థసారధి అన్నారు. ఈ విధంగా టిడిపి, బిజెపి మధ్య విపరీతమైనటువంటి ఫైట్ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: